రాజ్‌-కోటి.. 200 సినిమాలకు మ్యూజిక్​.. కాలం కలిపిన స్నేహం విడిపోవడానికి కారణమిదే! - మ్యూజిక్​ డైరెక్టర్​ కోటీ భావోద్వేగం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 21, 2023, 8:18 PM IST

రాజ్‌-కోటి.. ఒకప్పుడు టాలీవుడ్‌లో ఈ బ్రాండ్‌కు ఉన్న క్రేజే వేరు. పోస్టర్‌పై ఈ సంగీత ద్వయం పేరు కనిపించిందంటే.. ఆ సినిమా పక్కాగా మ్యూజికల్‌ హిట్‌ అవ్వాల్సిందే. వీరిద్దరూ కలిసి మన ఆడియెన్స్​కు ఎన్నో ఎవర్​గ్రీన్​ సూపర్ హిట్​ సాంగ్స్​ అందించారు. దశాబ్దాలపాటు సినీప్రియులను తమ సంగీతంతో అలరించారు. వీరి కాంబోలో వచ్చిన 'యముడికి మొగుడు', 'కొండవీటి రౌడీ', 'కొదమ సింహం', 'కర్తవ్యం', 'పెద్దరికం', 'మెకానిక్‌ అల్లుడు', 'ముఠా మేస్త్రీ', 'హలో బ్రదర్‌' వంటి ఆల్బమ్స్‌ సూపర్​ సక్సెస్‌ అందుకున్నాయి. అయితే విశేష ఆదరణ సొంతం చేసుకున్న వీరిద్దరూ అనుకోని కారణాలతో సుమారు పదేళ్లపాటు దూరంగా ఉన్నారు. మనస్పర్థలు పోయి కలిసినప్పటికీ.. ప్రొఫెషనల్​గా కలిసి పనిచేయలేదు. అయితే ఇప్పుడా ద్వయంలో రాజ్‌(68) ఆదివారం గుండెపోటుతో  కన్నుమూశారు. ఆయన మరణంతో సంగీత ప్రపంచంలో విషాదం నెలకొంది. దీంతో ఆయన మిత్రుడు కోటి భావోద్వేగమయ్యారు. ఈ సందర్భంగా గతంలో తామిద్దరు విడిపోవడం గతంలో ఆలీతో సరదాగా ఇంటర్వ్యూలో మాట్లాడారు. కాలమే తమని కలిపిందని, కాల ప్రభావంతోనే తాము విడిపోయామని అన్నారు. ఇంకా పలు విషయాల గురించి మాట్లాడారు.. 

కాలం కలిపిందిలా..! అలనాటి మ్యూజిక్ డైరెక్టర్​ చక్రవర్తి వద్ద రాజ్‌, కోటి అసిస్టెంట్స్‌గా చాలాకాలం పనిచేశారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. తరచూ సంగీతం గురించే మాట్లాడుకునేవాళ్లు. 1982లో తెరకెక్కిన 'ప్రళయగర్జన' చిత్రానికి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పనిచేసే అవకాశం రాజ్‌కు లభించింది. అయితే తన ఫ్రెండ్​ కోటితో కలిసి సంగీత ద్వయంగా ఎంట్రీ ఇవ్వాలని ఆయన భావించారు. అలా, వీరిద్దరూ కలిసి ఆ సినిమాతోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా సక్సెస్​ అవ్వడంతో కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి.. ఇలా ఎంతోమంది స్టార్స్‌ చిత్రాలకు వీళ్లు పనిచేశారు.

ఇదీ చూడండి: ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.