సిటీ బస్సు ఎక్కిన సీఎం- అవాక్కైన ప్రయాణికులు - బస్సులో తమిళనాడు సీఎం
🎬 Watch Now: Feature Video
ఆర్టీసీ బస్సులో ప్రయాణించి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. ప్రయాణికుల్ని ఆశ్చర్యపరిచారు. చెన్నై కన్నాగిలోని కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు ఆయన వెళ్లారు. అక్కడ ఆరోగ్య సిబ్బంది, టీకా తీసుకున్నవారితో మాట్లాడారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును చూసిన స్టాలిన్.. తన కాన్వాయ్ ఆపి ఆ బస్సెక్కారు. ఈ అనూహ్య పరిణామంతో బస్సులోని డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆర్టీసీ బస్సుల్లో సదుపాయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు స్టాలిన్‌తో సెల్ఫీలు తీసుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ.. స్టాలిన్ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.