ప్రియాంక 'గాంధీగిరి'.. హౌస్ అరెస్ట్ వేళ చీపురు పట్టి... - ప్రియాంక గాంధీ హౌస్ అరెస్టు
🎬 Watch Now: Feature Video
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. చీపురు పట్టి స్వయంగా తన గదిని ఊడ్చుతూ కనిపించారు. ఉత్తర్ప్రదేశ్ లఖింపుర్ హింసాత్మక ఘటన నేపథ్యంలో.. అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించగా ఆదివారం ఆమెను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. సీతాపుర్లోని ఓ అతిథి గృహంలో ఉన్న ప్రియాంక.. ఇలా చీపురుతో గదిని శుభ్రం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్గా మారింది.