సరిహద్దు మూసివేత.. భారీగా ట్రాఫిక్ జామ్ - Delhi lockdown news
🎬 Watch Now: Feature Video
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్-దిల్లీ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దిల్లీలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇటు ఉత్తర్ ప్రదేశ్ గాజియాబాద్లోను కొన్ని రోజులుగా వైరస్ బాధితులు ఎక్కువవుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వైద్యాధికారుల సూచనల మేరకు గాజియాబాద్-దిల్లీ సరిహద్దులను మూసివేసింది పాలనా యంత్రాంగం. ఉదయం విధులకు హాజరై, సాయంత్రం తిరిగి వచ్చిన ప్రయాణికుల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సరిహద్దులో చిక్కుకుపోయిన ప్రయాణికులు గందరగోళంలో పడ్డారు.