గోదాంలో నక్కి.. ఆరు రోజుల తర్వాత ఆకలితో చిక్కి.. - Leopard caught in tamilnadu
🎬 Watch Now: Feature Video
Leopard Trapped In Coimbatore: తమిళనాడులోని ఓ గోదాములో నక్కిన చిరుతపులి ఆరు రోజుల తర్వాత అటవీశాఖ సిబ్బందికి చిక్కింది. నెలరోజులుగా జనవాసాల్లో తిరుగుతున్న చిరుతపై రాష్ట్ర అటవీశాఖ సిబ్బంది నిఘా పెట్టారు. అది పలుమార్లు చిక్కినట్టే చిక్కి తప్పించుకుంది. అయితే.. ఈనెల 16న కోయంబత్తూరులోని బీకే పుడూర్‌లో ఉన్న పాతబడిన గోదాములోకి చిరుత ప్రవేశించింది. దానిని గమనించిన ఒక కూలీ వెంటనే గోదాము షట్టర్‌ను మూసివేసి అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. రెండు బోనులు ఏర్పాటు చేసి వాటిలో కోళ్లను ఎరగా వేసి దానిని బంధించేందుకు ఆరు రోజులుగా అధికారులు శ్రమించారు. ఆహారం, నీరులేక నీరసించిన చిరుతపులి శనివారం తెల్లవారుజామున ఎర కోసం వచ్చి అటవీశాఖ బోనులో చిక్కింది. చిరుతకు ఆహారం, చికిత్స అందించి కోలుకున్న తర్వాత అడవిలో వదిలిపెడతామని అధికారులు వివరించారు.