ఆ ఇంట్లో వేలాది తేళ్లు.. లీటరు విషం 86 కోట్ల రూపాయలు - గది నిండా తేళ్లు ఉన్న వీడియో
🎬 Watch Now: Feature Video
ఓ గదిలో వేలాది తేళ్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దృశ్యాలు గతేడాదికి సంబంధించినవని తెలుస్తోంది. ఈ వీడియోను ఆదివారం ట్విట్టర్లో అప్లోడ్ చేసిన 12 గంటల్లోనే 40లక్షల మందికిపైగా వీక్షించారు. ఇది ఎక్కడ తీశారో స్పష్టత లేనప్పటికీ అందులో వినిపిస్తున్న మాటల ఆధారంగా బ్రెజిల్లో తీసి ఉండొచ్చని, అవి అత్యంత ప్రమాదకరమైన డెత్ స్టాకర్ తేళ్లని అర్థమవుతోంది. ఈ తేళ్ల విషం ఎంతో ఖరీదైనది. ఒక్కో లీటరు 10.5 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 86 కోట్ల 76 లక్షల రూపాయలు పలుకుతుంది. కానీ ఒక్క లీటరు కావాలంటే ఒక్కో తేలు నుంచి దాదాపు 7లక్షల సార్లు విషం తీయాల్సి ఉంటుంది.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST