పెట్రోల్ బంక్లో చోరీకి యత్నించిన దుండగుడిని కాల్చి చంపిన సెక్యూరిటీ గార్డు - పంజాబ్ అమృత్సర్ క్రైమ్ న్యూస్
🎬 Watch Now: Feature Video
పంజాబ్ అమృత్సర్లోని మల్లియన్ పెట్రోల్ బంక్లో చోరీకి యత్నించారు ఇద్దరు దుండగులు. తుపాకీతో పెట్రోల్ బంక్ క్యాషియర్ను బెదిరించారు. అనంతరం అతడి వద్ద డబ్బులను తీసుకునేందుకు యత్నించారు. అప్పుడు వెంటనే పెట్రోల్ బంక్ సెక్యూరిటీ గార్డు వచ్చి దుండగులపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఒక దుండగుడు అక్కడికక్కడే మరణించాడు. మరో దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఆదివారం రాత్రి జరిగిందీ ఘటన. పెట్రోల్ బంక్లో ఉన్న సీసీటీవీలో ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దుండగుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం దుండగులు ఇదే పెట్రోల్ బంక్లో చోరీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST