మద్యం మత్తులో కారును ఢీకొట్టి 3 కిలోమీటర్లు లాక్కెళ్లిన ట్రక్కు డ్రైవర్ - కారును ఈడ్చుకెళ్లిన ట్రక్కు డ్రైవర్
🎬 Watch Now: Feature Video
ఉత్తర్‌ప్రదేశ్ మేరఠ్‌లో ఓ ట్రక్కు డ్రైవర్ తాగిన మత్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. అతివేగంతో ఓ కారును ఢీకొట్టి మూడు కిలోమీటర్ల దూరం లాక్కెళ్లాడు. ఘటన సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారు. ట్రక్కు కారును లాక్కెళ్తున్న సమయంలోనే వారంతా బయటకు దూకేశారు. పార్థాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. రీతానీ ప్రాంతంలో కారు డ్రైవర్ యూటర్న్ తీసుకొనేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ట్రక్కు.. కారును ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా కారును అలాగే ఈడ్చుకెళ్లాడు ట్రక్కు డ్రైవర్. మూడు కిలోమీటర్లు వెళ్లిన తర్వాత ఓ డంపర్‌ను ఢీకొట్టాడు. దీంతో ట్రక్కు అక్కడే ఆగిపోయింది. ఈ ఘటనలో కారు టైర్లు ఊడిపోయాయి. ట్రక్కును డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపాడని కారు యజమాని అనిల్ కుమార్ ఆరోపించాడు. తాము వారించినా ట్రక్కును ఆపకుండా వెళ్లిపోయాడని చెప్పాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.