దీపావళికి ముస్తాబైన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆకర్షిస్తోన్న విద్యుత్ కాంతులు - శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దీపావళి
🎬 Watch Now: Feature Video
Shamshabad Airport హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రయాణికులను గ్రాండ్గా ఆహ్వానిస్తూ ఏర్పాట్లు చేశారు. విదేశాల నుంచి వచ్చే ప్రజలకు ఆహ్వానం పలుకుతూ ఎయిర్పోర్ట్ యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎయిర్పోర్ట్ను అందంగా అలంకరించి, లైట్ సెట్టింగ్లతో తీర్చిదిద్దారు. ఇవి ప్రయాణికులను ఎంతగానో ఆకర్షితులను చేస్తున్నాయి. ప్రధానంగా విదేశాల నుంచి వచ్చే విదేశీ ప్రయాణికులకు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని పండుగ విశిష్టతను చాటే విధంగా అలంకరణ దీపాల కాంతులు ఏర్పాటు చేశారు. పలువురు ప్రయాణికులు అలంకరణ వద్ద సెల్ఫీ ఫోటోలు దిగుతూ సందడి చేస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST