ఆవు మృతదేహాన్ని జేసీబీకి కట్టి.. రోడ్డుపై లాక్కెళ్లి.. - సత్నా వీడియో వైరల్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16478089-thumbnail-3x2-cow.jpg)
మధ్యప్రదేశ్ సత్నాలో హృదయవిదారక ఘటన జరిగింది. పెప్టెక్ సిటీ టౌన్షిప్ సమీపంలోని దాబా వద్ద ఓ ఆవు మరణించగా.. దాని మృతదేహాన్ని తరలించేందుకు దాబా నిర్వహకులు జేసీబీని ఏర్పాటు చేశారు. జేసీబీకి ఆవును తాడుతో కట్టి రోడ్డుపై లాక్కెళ్లి.. ఖాళీ ప్రదేశంలో పడేశారు. ఈ ఘటనను కొందరు స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరలైన ఈ వీడియో అధికారుల దృష్టి చేరింది. దీంతో జేసీబీ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST