86 ఏళ్ల వయస్సులో ఆరు నిమిషాలు శీర్షాసనం వేసి గిన్నిస్ రికార్డ్ - odisha guinees record person news
🎬 Watch Now: Feature Video
కొందరు యువకులకు సాధారణ ఆసనాలు వేస్తేనే ఆయాసంగా అనిపిస్తుంది. అలాంటిది కూర్చోవడమే కష్టమైన వృద్ధాప్యంలో శీర్షాసనం వేయడం అసాధారణ విషయం. అయితే, అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించారు ఒడిశా రవూర్కెలాలోని ఈశ్వర్నాథ్ గుప్తా. కోయెల్ నగర్ ప్రాంతానికి చెందిన ఆయన కొత్త సంవత్సరం జనవరి ఒకటో తేదీన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షంలో ఆరు నిమిషాల 36 సెకన్ల పాటు శీర్షాసనం వేశారు. తద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. గతంలో కెనడాకు చెందిన 74 ఏళ్ల రిచర్డ్ డీ పేరిట ఈ రికార్డు ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును తన పేరిట లిఖించుకున్నారు ఈశ్వర్నాథ్. ఈయన సాధించిన విజయానికి స్థానికులు అభినందనలు చెబుతున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST