కొనఊపిరితో చిన్నారి.. పనిచేయని ఆక్సిజన్ యంత్రం.. డాక్టర్ ఐడియాతో... - doctor gave breathing to baby girl
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14728169-thumbnail-3x2-born-baby.jpg)
newborn saved by lady doctor: అప్పుడే పుట్టిన చిన్నారి ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్న వేళ.. వైద్యురాలు అద్భుతం చేశారు. పసిబిడ్డకు ప్రాణం పోసి కాపాడారు. నోట్లోకి గాలి ఊది చిన్నారిని బతికించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈ ఘటన జరిగింది. పాప జన్మించిన తర్వాత ఆక్సిజన్ తీసుకోవడం లేదని వైద్యులు గ్రహించారు. ఆక్సిజన్ యంత్రంలో ఉంచాలని భావించారు. సరిగ్గా అదే సమయానికి పరికరం పనిచేయలేదు. దీంతో వైద్యురాలు సురేఖ చౌదరి స్వయంగా చిన్నారికి ఊపిరి అందించారు. ఏడు నిమిషాల తర్వాత పాప ఏడుపు వినిపించింది. దీంతో తల్లిదండ్రులతో పాటు వైద్య సిబ్బంది సంతోషంలో మునిగితేలారు.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST