'కల్యాణ్‌రామ్‌కు అప్పుడు తీవ్ర అనారోగ్యం.. 4 నెలలు బెడ్‌పైనే.. ఆమె వల్లే ఇప్పుడిలా..' - అమిగోస్ హీరోయిన్ అషికా రంగనాథ్ సుమ అడ్డా
🎬 Watch Now: Feature Video
'అమిగోస్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్ హీరో నందమూరి కల్యాణ్‌రామ్.. బాక్సాఫీసు వద్ద దూసుకెళ్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా.. ప్రముఖ యాంకర్ సుమ హోస్ట్‌గా ఈటీవీలో ప్రసారమవుతున్న 'సుమ అడ్డా' టాక్ షోకు గెస్ట్‌గా వచ్చారు. కల్యాణ్‌రామ్‌తో పాటు హీరోయిన్ ఆషికా రంగనాథ్, నటుడు బ్రహ్మాజీ, అమిగోస్ దర్శకుడు రాజేంద్ర రెడ్డి వచ్చారు. సుమతో సరదాగా ముచ్చటించారు. బ్రహ్మాజీ పలు సందర్భాల్లో నవ్వులు పూయించారు. అషికా కూడా తన గురించి, సినిమా అనుభవాల గురించి పలు విషయాలు షేర్ చేసుకున్నారు. ఇక, కల్యాణ్‌రామ్.. సుమ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. సంభాషణ మధ్యలో సుమ ఓ ఫొటో చూపించి.. అందులో కల్యాణ్‌రామ్ చేతికి ఉన్న పచ్చ బొట్టు గురించి అడిగారు. దీనికి కల్యాణ్‌రామ్ తన జీవితంలో జరిగిన ఓ ఎమోషనల్ సంఘటనను పంచుకున్నారు. తాను తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు.. దీంతో నాలుగు నెలల పాటు బెడ్‌పైనే ఉన్నానని చెప్పారు. అప్పుడు ఆమె వల్లే అనారోగ్యం నుంచి కోలుకున్నట్లు తెలిపారు. ఆమె ఎవరో తెలియాలంటే ఈ వీడియో చూసేయండి మరి.