ETV Bharat / sukhibhava

వెయిట్ లాస్​ కోసం సైక్లింగ్ స్టార్ట్ చేస్తారా? ఎలాంటి సైకిల్ కొనాలి? గేర్స్ తప్పనిసరా? - గీతాకృష్ణ దమ్మాలపాటి ఫ్యాట్ రైడర్

World Bicycle Day 2023 : "చలో చలో సైకిల్.. బిరబిర బిరబిర బిరబిర పరుగులు తీసే చలో చలో సైకిల్.. ఆనంద సీమలకు హాయిహాయిగా చలో చలో సైకిల్".. 1945 నాటి 'స్వర్గ సీమ' సినిమాలోదీ గీతం. తెలుగు రాష్ట్రాల్లోని అనేక మంది ఇప్పుడు నిజజీవితంలో ఇదే పాట పాడుకుంటున్నారు. వ్యాపార, ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి​ నుంచి ఉపశమనం కోసం సైకిల్ ఎక్కుతున్నారు. శారీరకంగా, మానసికంగా ఫిట్​గా​ మారే ప్రయత్నం చేస్తున్నారు. వారిలా మీరూ సైక్లింగ్ మొదలుపెట్టాలని అనుకుంటున్నారా? ఎలాంటి సైకిల్ కొనాలి, రోజుకు ఎంత దూరం తొక్కాలి అనే అనుమానాలు ఉన్నాయా? అయితే.. వరల్డ్ బైసికిల్ డే (జూన్​ 3) సందర్భంగా సామాన్యుడి రథం 'సైకిల్' కథ మీకోసం..

world bicycle day 2023
వరల్డ్ బైసికిల్ డే 2023
author img

By

Published : Jun 3, 2023, 3:34 AM IST

Updated : Jun 14, 2023, 4:43 PM IST

ట్రింగ్​ ట్రింగ్.. సూర్యోదయానికి ముందే మోగింది సైకిల్ బెల్. చూస్తే పేపర్ బాయ్. కాసేపటికి మరోసారి అదే శబ్దం. ఈసారి పాలు పోసే వ్యక్తి. హ్యాండిల్​కు అటూఇటూ రెండు, క్యారేజీపై ఒకటి, క్యారేజీకి అటూఇటూ రెండు.. మొత్తం ఐదు పాల క్యాన్లు కట్టుకుని వచ్చాడు. నవ్వుతూ పలకరించి పాలు పోసి వెళ్లిపోయాడు. మళ్లీ అదే ట్రింగ్ ట్రింగ్! ఈసారి మన ఇంట్లోని సైకిలే. స్కూల్​ టైమ్​ అవుతోందని, త్వరగా బడి దగ్గర దించమంటూ బెల్ మోగించి పిలిచారు ఇద్దరు పిల్లలు. ముందు ఒకరు, వెనుక మరొకర్ని కూర్చోబెట్టుకుని స్కూల్​కు బయలుదేరితే.. ఎదురొచ్చాడు పక్కింటి వ్యక్తి. ఉదయాన్నే పొలానికి వెళ్లి.. సైకిల్​పై గడ్డిమోపు కట్టుకుని వస్తున్నాడాయన. అలా ముందుకు సాగితే.. ఇంటింటికీ తిరిగి ఇడ్లీ అమ్మే కుర్రాడు, చాయ్​వాలా, కూరగాయల వ్యాపారి, అప్పుడే పెట్రోలింగ్ డ్యూటీ ఎక్కిన పోలీస్ కానిస్టేబుల్.. ఇలా అందరూ దర్శనమిచ్చారు. అందరికీ కామన్ పాయింట్.. సైకిల్. వారిలో ఎవరికీ పెట్రోల్ ఖర్చు లేదు, కాలుష్యం బెడద లేదు, ట్రాఫిక్ జామ్​ల జంజాటం లేదు!

ఇదంతా ఈ తరం చూసి ఉండకపోవచ్చు. కానీ.. చాలా మందికి స్వీయ అనుభవమే. అప్పట్లో అంతలా ఉండేది సైకిల్​ హవా. అత్యుత్తమ, చౌకైన వ్యక్తిగత ప్రయాణ సాధనంగా నిలిచేది. 'సామాన్యుడి రథం'గా వెలుగొందేది. అయితే.. ఈ ఘన ప్రస్థానం వెనుక చాలా పెద్ద కథే ఉంది.

world bicycle day in india
సైక్లింగ్​తో ఆనందం, ఆరోగ్యం

వేసవి మాయం.. సైకిల్​ జననం!
First Cycle in the world : 1816.. యావత్ ప్రపంచం తీవ్ర ఆహార సంక్షోభాన్ని చవిచూసిన సంవత్సరమది. దానిని 'వేసవి లేని ఏడాది' అంటుంటారు. అంతకుముందు ఏడాది ఇండోనేసియా(అప్పటి డచ్ ఈస్ట్​ ఇండీస్​)లో మౌంట్ టంబోరా అగ్నిపర్వతం పేలడం ఇందుకు ప్రధాన కారణం. చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైనదిగా చెప్పే ఆ పేలుడు కారణంగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో పెను మార్పులు వచ్చాయి. 1816లో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 0.4-0.7 డిగ్రీల సెల్సియస్ మేర పడిపోయింది. ఎక్కడా సరిగా పంటలు పండలేదు. ఐరోపాలో పరిస్థితి మరింత దయనీయం. తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తింది. పశువులకు మేత లేదు. గుర్రాల ఆకలి చావులతో రవాణా వ్యవస్థ ప్రభావితమైంది. ఆ సమస్య నుంచే పుట్టుకొచ్చింది తొలి సైకిల్!

first cycle in the world
బేరన్ కార్ల్ వాన్ డ్రెయిస్ తయారు చేసిన తొలి సైకిల్

జర్మనీ ప్రభుత్వంలో పనిచేసిన బేరన్ కార్ల్ వాన్ డ్రెయిస్.. తొలి సైకిల్ సృష్టికర్త! రెండు చక్రాలు, హ్యాండిల్​తో.. పెడల్, చైన్ లేకుండా.. మధ్యలో కూర్చుని కాళ్లతో తోసుకుని వెళ్లేలా 1817లో దాన్ని రూపొందించాడు. తొలిసారి జూన్ 12న మన్​హైమ్ నగరం నుంచి గంటలో 13కిలోమీటర్లు ప్రయాణించాడు. తన సైకిల్​కు లౌఫ్​మెషీన్(పరుగెత్తే యంత్రం)గా నామకరణం చేశాడు. 1818లో పేటెంట్ తీసుకున్నాడు. వాణిజ్యపరంగా విజయవంతమైన తొలి రెండు చక్రాల వాహనం అదే. తర్వాత దానిని డ్రెయిసీన్​ లేదా వెలోసిపీడ్​ అని పిలిచేవారు. హాబీ హార్స్​, డాండీ హార్స్​గానూ వ్యవహరించేవారు. అలా వాన్ డ్రెయిస్​ రూపొందించిన తొలి సైకిల్ ఉత్పత్తి జర్మనీ, ఫ్రాన్స్​లో మొదలైంది. తర్వాత ఎప్పటికప్పుడు మార్పులు సంతరించుకుంటూ దాదాపు 206 ఏళ్లుగా దూసుకెళ్తోంది సైకిల్.

193 దేశాల 'గ్రూప్​ రైడ్'
World Bicycle day history : తుర్క్​మెనిస్థాన్​ అనే ఓ చిన్న దేశం.. 193 ప్రపంచ దేశాల్ని కలిపి సైకిల్ ఎక్కించింది. ఇందుకోసం ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఓ తీర్మానం ప్రవేశపెట్టింది. సభ్యదేశాలన్నింటినీ ఒప్పించింది. తుర్క్​మెనిస్థాన్ తీర్మానం 2018 ఏప్రిల్ 12న ఆమోదం పొందింది. అలా జూన్​ 3ను 'వరల్డ్​ బైసికిల్​ డే' ప్రకటించింది ఐరాస. పేదరిక నిర్మూలనకు సైకిల్​ను ఓ సాధనంగా ఉపయోగించుకోవడం; సుస్థిరాభివృద్ధి సాధన; విద్యా వ్యవస్థ బలోపేతం; వ్యాధుల నివారణ, ఆరోగ్యకర జీవనాన్ని ప్రోత్సహించడం; సామాజిక సమ్మిళిత జీవనం, శాంతిని కాపాడడం.. వరల్డ్ బైసికిల్​ డే జరుపుకోవడం వెనుక ముఖ్య ఉద్దేశాలు. అలా 2018లో ప్రపంచవ్యాప్తంగా తొలి సైకిల్​ డే నిర్వహించారు. ఈ రోజు (2023 జూన్​ 3) 6వ వరల్డ్ బైసికిల్ డే.

cycling photos
పొలాలు, చెట్ల మధ్య సైక్లింగ్​తో మనసుకు నవోత్తేజం!

టెన్షన్స్​ను తొక్కిపడేద్దాం.. కొవ్వును కరిగించేద్దాం..
Cycling healthy lifestyle : ప్రాజెక్ట్ డెడ్​లైన్​ టెన్షన్స్.. లేట్​ నైట్ మీటింగ్స్.. సరికొత్త టార్గెట్స్.. ఎప్పుడో అర్ధరాత్రి దాటాక నిద్ర! అయినా.. వేకువజామునే లేచింది తన్విత. మేఘాల మధ్య చంద్రుడి దాగుడుమూతలు ఇంకా కొనసాగుతూ ఉండగానే.. సూర్యోదయానికి ముందే రోడ్డెక్కింది. అప్పుడే నిద్రలేచిన పక్షుల కిలకలరావాలు.. వినువీధిలో ఒక్కొక్కటిగా మాయమైపోతున్న నక్షత్రాలు.. ఇది మండే వేసవి కాలమనే విషయాన్నే మర్చిపోయేలా ముఖాన్ని తాకే చల్లటి చిరుగాలులు.. కెమెరాలో బంధించి తీరాలనిపించే లేలేత సూర్యకిరణాలు.. రణగొణ ధ్వనులు లేని ఖాళీ రహదారులు.. వీటి మధ్య ముందుకు సాగిపోయింది. కాసేపటికే ఎంత మార్పు! నిన్నటి టెన్షన్స్​ అన్నీ మాయం! మానసికంగా నవోదయం.. నూతనోత్తేజంతో సరికొత్త సవాళ్లకు సిద్ధం! ఇది తన్విత డైరీలోని ఓ పేజీ మాత్రమే కాదు. సైకిల్​తో సహవాసాన్ని 'స్ట్రెస్ బస్టర్​'గా చేసుకున్న అనేక మందిది ఇదే కథ.

సూపర్​ ఫిట్​గా మారిన 'ఫ్యాట్​ రైడర్​'
Cycling weight loss results : గీతాకృష్ణ దమ్మాలపాటి(47).. విజయవాడ వాసి. తెలుగు రాష్ట్రాల సైక్లిస్ట్​లలో చాలా మందికి 'GK ఫ్యాట్ రైడర్'​గా సుపరిచితం. ఒకప్పుడు ఆయన బరువు 138 కిలోలు. 2020 మేలో సైకిల్​ ఎక్కారు. 'ఫ్యాట్​ బైక్'​తో వెయిట్​ లాస్ జర్నీ ప్రారంభించారు. కట్ చేస్తే.. మూడేళ్లు చకచకా గడిచిపోయాయి. 200కుపైగా సెంచరీ రైడ్స్​, 500కుపైగా హాఫ్​ సెంచరీ రైడ్స్, మరెన్నో షార్ట్ రైడ్స్​తో.. మూడేళ్లలో దాదాపు 58వేల కిలోమీటర్లు సైక్లింగ్ చేశారు జీకే. ఇప్పుడు ఆయన బరువు 90 కిలోలు.

cycling weight loss before and after
గీతాకృష్ణ దమ్మాలపాటి(2020, 2022లో తీసిన ఫొటోలు)

జీకే ఇంతలా సైక్లింగ్ చేయడం వెనుక ఓ పెద్ద కథే ఉంది. అది 2020 లాక్​డౌన్​ సమయం. అప్పుడు ఆయన వయసు 44 ఏళ్లు. వెన్నునొప్పి తీవ్రంగా బాధించింది. డాక్టర్​ను కలిస్తే.. ఫుల్​ బాడీ చెకప్​ చేయించమన్నారు. కానీ.. సాధ్యపడలేదు. కారణం.. గీతాకృష్ణ భారీకాయాన్ని స్కాన్ చేసేందుకు ఎంఆర్​ఐ యంత్రం సరిపోలేదు. ఆ సమయంలో జీకే కాస్త చిన్నబుచ్చుకున్నారు. కాసేపటికి తేరుకున్నారు. తక్షణమే బాడీ ఫిట్​నెస్​పై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తించారు. మొదట్లో కాస్త కష్టంగా ఉన్నా.. పట్టుదలతో ముందుకు సాగారు. సైక్లింగ్​తో ఎంత ఫిట్​గా మారవచ్చో చూపించారు.

vijayawada cyclist GK Fat rider
ఎన్​టీఆర్ శతజయంతి నాడు 200వ సెంచరీ రైడ్ చేసిన జీకేకు సన్మానం

Cycling weight loss transformation : గీతాకృష్ణ ఫిట్​నెస్ జర్నీ.. ఎంతోమందిలో స్ఫూర్తినింపింది. సైకిల్ ఎక్కేలా చేసింది. విజయవాడలో సైక్లింగ్​ను ప్రోత్సహించేందుకు ఎంతో చురుకుగా పనిచేస్తుంటారు జీకే. 'యోధ పెడలర్స్​' క్లబ్ ద్వారా అందరినీ ఒక్కటి చేసి.. గ్రూప్​ రైడ్స్​ నిర్వహిస్తుంటారు. వాటిలో 'బెజవాడ గుంటూరు బిర్యానీ రైడ్'​ చాలా ఫేమస్. సాయంత్రం విజయవాడలో బయల్దేరి గుంటూరు వెళ్తారు. అక్కడ రుచికరమైన బిర్యానీ తిని రాత్రికి తిరిగొచ్చేస్తారు.

vijayawada cyclist GK Fat rider
విజయవాడ సైక్లిస్ట్ గీతాకృష్ణ దమ్మాలపాటి

Cycling health benefits : ఇలా ఆడుతూపాడుతూ, రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తూ బరువు తగ్గాలని ఎవరికి మాత్రం ఉండదు? వారందరికీ ఉత్తమ మార్గం సైకిల్. వెయిట్​ లాస్ మాత్రమే కాదు.. సైకిల్​తో ఆరోగ్యపరమైన ప్రయోజనాలు మరెన్నో. మరీ ముఖ్యంగా.. గుండె ఆరోగ్యానికి సైక్లింగ్ ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు హైదరాబాద్ జూబ్లీహిల్స్​ అపోలో ఆస్పత్రిలో కార్డియో థొరాసిక్ సర్జన్​, కన్సల్టెంట్​గా చేసే డాక్టర్ సునీల్ కుమార్ స్వెయిన్.

"సైక్లింగ్ చేస్తే గుండె వేగం పెరుగుతుంది. తద్వారా హృదయ కండరాలు దృఢంగా మారతాయి. రక్తపోటు, బరువు నియంత్రణకు ఇది ఎంతో మేలు చేస్తుంది. సైక్లింగ్ చేయని వారితో పోల్చితే.. క్రమంగా సైక్లింగ్ చేసేవారికి గుండెపోటు ముప్పు 15శాతం తక్కువ ఉన్నట్లు 2016లో సర్కులేషన్​ అనే జర్నల్​లో ఓ అధ్యయనం ప్రచురితమైంది. సైక్లింగ్​ వంటి కసరత్తులకు కాస్త సమయం కేటాయించినా హృద్రోగాల ముప్పు తగ్గుతుంది. గుండె ఆరోగ్యానికి సైక్లింగ్ ఎంతో మేలు చేస్తుందని అనేక అధ్యయనాల్లో తేలింది." అని చెప్పారు డాక్టర్ సునీల్.

Dr Sunil Kumar Swain
డాక్టర్ సునీల్ కుమార్ స్వెయిన్

డాక్టర్ సునీల్ కుమార్​ కూడా ఓ సైక్లిస్ట్. క్రమం తప్పకుండా సైక్లింగ్ చేస్తుంటారు. హైదరాబాద్​లోని వేర్వేరు సైక్లింగ్ క్లబ్స్ నిర్వహించే గ్రూప్​రైడ్స్​లో పాల్గొంటూ ఉంటారు. మానసిక ఆరోగ్యానికీ సైక్లింగ్ ఎంతో మేలు చేస్తుందని ఆయన చెబుతున్నారు.

Cycling stress relief : "ఇతర వ్యాయామాలతో పోల్చితే మానసిక ఆరోగ్యానికి సైక్లింగ్ కాస్త ఎక్కువ మేలు చేస్తుందని స్టాన్​ఫర్డ్ యూనివర్సిటీ స్కూల్​ ఆఫ్​ మెడిసిన్​లో సైకియాట్రీ, పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ అలన్ రీస్​ అధ్యయనంలో తేలింది. వారంలో కనీసం ఒకసారి సైక్లింగ్ చేసే చిన్నారుల మానసిక ఆరోగ్యం ఇతరులతో పోల్చితే ఎంతో బాగుందని మరో పరిశోధనలో వెల్లడైంది. సైక్లింగ్ వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. చదువులో మరింత ప్రతిభ కనబరుస్తారు. మన మెదడులో జ్ఞాపకశక్తితో ముడిపడిన కణాలు పెరిగేందుకు సైక్లింగ్ ఉపకరిస్తుంది. సైక్లింగ్​ వల్ల మెదడులో డోపమిన్ విడుదల అవుతుంది. ఫలితంగా మనం సంతోషంగా ఉన్నామన్న భావన కలుగుతుంది. ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుంది" అని వివరించారు డాక్టర్ సునీల్.

Dr Sunil Kumar Swain
స్నేహితులతో కలిసి డాక్టర్ సునీల్ సైకిల్ రైడ్

సైక్లింగ్​తో ఆరోగ్యపరంగా కలిగే లాభాల్లో మరికొన్ని..

  • Cycling benefits for body : వారంలో కనీసం 3సార్లు అయినా సైకిల్ తొక్కితే.. రక్తపోటు, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి. మధుమేహం బాధ ఉండదు.
  • సైకిల్ తొక్కినప్పుడు మెదడు నుంచి విడుదలయ్యే న్యూరోట్రాన్స్‌మిటర్లు జీవక్రియల పనితీరును మెరుగుపరుస్తాయి. ఏకాగ్రత, చురుకుదనం పెరుగుతాయి. కళ్లు, మెదడు బాగా పనిచేస్తాయి.
  • కండరాల దృఢత్వం, ఎముకల్లో పటుత్వం పెరుగుతుంది. లైంగిక ఆరోగ్యం మెరగవుతుంది.
  • Cycling helps reduce obesity : శరీరంలోని కొవ్వు కరుగుతుంది. క్యాన్సర్, ఆందోళన, డెమెన్షియా ముప్పు తగ్గుతుంది. నిద్రలేమి సమస్యను అధిగమించేందుకు సైక్లింగ్ సహకరిస్తుంది.
  • నడిచినా, పరుగెత్తినా.. మోకాళ్లు, వెన్నుపై కొంత ఒత్తిడి పడే అవకాశముంది. కానీ.. సైకిల్ తొక్కినప్పుడు కీళ్లపై పడే ఒత్తిడి తక్కువ. లాభాలు ఎక్కువ. తొడలు, పిరుదుల దగ్గర పేరుకున్న కొవ్వు కరుగుతుంది.
  • సైక్లింగ్​ వల్ల మహిళలకు నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి. సిజేరియన్ల వల్ల వచ్చిన వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఆలస్యమెందుకు.. ఇప్పుడే సైకిల్​ ఎక్కండి..
Which Cycle to buy for fitness : సైక్లింగ్​తో లాభాలెన్నో.. ఫిట్​గా అవుతాం.. పెట్రోల్, డీజిల్ ఖర్చుల బాధ ఉండదు.. పర్యావరణహితం.. మనమూ మొదలుపెట్టడం బెటర్!.. అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ.. ఎలాంటి సైకిల్ కొనాలి? గేర్​ సైకిల్​ తప్పనిసరా? ఎంత ఖర్చు పెట్టాలి? రోజుకు ఎంత దూరం తొక్కవచ్చు? సిటీల్లో ఏ రూట్లలో రైడ్ చేయాలి? అనే ప్రశ్నలకు సరైన జవాబులు దొరక్క వాయిదా వేస్తూ ఉంటారు. నిజానికి ఇవేవీ సంక్లిష్టమైన విషయాలేవీ కావు. సైక్లింగ్ బేసిక్స్ తెలుసుకుని, మొదట్లో చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే.. మీరూ 'జీకే ఫ్యాట్​ రైడర్​'లా సెంచరీల సునామీ సృష్టించవచ్చు. అవేంటంటే..

types of cycle in india
వివిధ రకాల సైకిల్స్
  • సింగిల్ స్పీడ్, ఎంటీబీ, హైబ్రిడ్, రోడ్ బైక్.. ఇలా ఎన్నో రకాల సైకిల్స్ ఉంటాయి. మనం ఏ అవసరం కోసం సైకిల్ కొంటున్నాం, ఎలాంటి రోడ్లపై రైడ్ చేస్తాం అనే అంశాల ఆధారంగా ఏం కొనాలో నిర్ణయించుకోవాలి. నెట్​లో చూస్తే ఆయా వేరియంట్స్ మధ్య తేడా తెలుస్తుంది. ఫిట్​నెస్​ కోసం కొత్తగా సైక్లింగ్ ప్రారంభించే నగర వాసులకు.. హైబ్రిడ్ బైక్ బెస్ట్ ఆప్షన్.
  • సైకిల్​ సాధ్యమైనంత తేలికగా ఉండాలి. సైకిల్ బరువుగా ఉంటే కసరత్తు బాగా చేసినట్టని కొందరు అనుకుంటారు. కానీ ఆ ఆలోచన సరికాదు. పెద్దపెద్ద టైర్లతో ఉండే ఫ్యాట్ బైక్స్, సస్పెన్షన్​తో ఉండే బైక్స్ ఆకర్షణీయంగా కనిపించినా.. మొదట్లో వాటి జోలికి వెళ్లకపోవడం ఉత్తమం.
  • Cycle gear vs non gear : గేర్​ సైకిల్​ తప్పనిసరిగా కొనాలా?.. అనేక మంది అనుమానం ఇది. సింగిల్ స్పీడ్(నాన్ గేర్) సైకిల్​నూ రైడ్ చేయొచ్చు. కానీ గేర్ సైకిల్ అయితే తొక్కడం సులువు. మోకాళ్లపై ఒత్తిడి పెద్దగా పడదు. హైదరాబాద్ తరహాలో ఎత్తుపల్లాల రోడ్లు, చిన్నచిన్న కొండలు ఉండే నగరాలకు గేర్ సైకిల్​ మంచి ఛాయిస్.
cycling photos
సైక్లింగ్​తో ఆనందం, ఆరోగ్యం
  • 'బైక్ ఫిట్' చాలా కీలకం. అంటే.. మీ ఎత్తుకు తగిన ఫ్రేమ్​ సైజ్​ సైకిల్​ను మాత్రమే కొనాలి. ఫ్రేమ్​ సైజ్​, సీట్​ హైట్​లో కొన్ని సెంటీమీటర్ల తేడా వచ్చినా ఇబ్బందే. మెడ, వెన్ను నొప్పులతో మొదటికే మోసం వస్తుంది. మీ ఎత్తుకు సరిపడా ఏ సైజ్​ సైకిల్ కొనాలో తెలుసుకునేందుకు ఇంటర్నెట్​లో సైజ్​ చార్ట్స్​ ఉంటాయి. ఈ విషయంలో మీ దగ్గర్లోని సైక్లింగ్ క్లబ్​ సభ్యులు, స్టోర్​ సిబ్బంది సహకారం తీసుకుంటే మంచిది.
  • సేఫ్టీ అతి ముఖ్యం. సైకిల్​తోపాటే హెల్మెట్, గ్లవ్స్, వాటర్ బాటిల్, లైట్స్​ తప్పక తీసుకోండి. సైకిల్​పై హెల్మెట్ పెట్టుకోకపోయినా పోలీసుల చలానా రాయరు కదా అని అశ్రద్ధ చేయవద్దు. హెల్మెట్ మీ భద్రత కోసమే.
  • తొందర పడొద్దు. సైకిల్ కొనేందుకు కాస్త సమయం కేటాయించి ఇంటర్నెట్​లో రీసెర్చ్ చేయండి. మీ చుట్టుపక్కల ఎవరైనా సైక్లిస్టులు ఉంటే వారితో మాట్లాడండి. ఎంత బడ్జెట్ కేటాయించాలో ఓ నిర్ణయానికి రండి. మీ అవసరాలకు సరిపోయే బైక్​ను కొనుగోలు చేయండి.
  • కొత్త సైకిల్ మాత్రమే కొనాలని లేదు. మీకు దగ్గర్లోని సైక్లింగ్ క్లబ్​ సభ్యుల్ని సంప్రదిస్తే తక్కువ బడ్జెట్​లో సెకండ్ హ్యాండ్​ బైక్స్​ దొరకవచ్చు. ఫేస్​బుక్​లోనూ ఇందుకు కొన్ని ప్రత్యేక గ్రూప్స్​ ఉన్నాయి. అయితే.. ఆన్​లైన్​లో సెకండ్ హ్యాండ్​ సైకిల్​ కొనే ముందు.. దానిని అమ్ముతున్న వ్యక్తి, బైక్ కండీషన్​ను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవడం తప్పనిసరి.
cycling photos
సైక్లింగ్​తో ఆనందం, ఆరోగ్యం!

సైకిల్​ కొనేశాం.. నెక్స్ట్​ ఏంటి?
Cycling guide for beginners : పైన చెప్పినట్టు ఫుల్​ రీసెర్చ్​ చేసేశాం.. చుట్టుపక్కల ఉన్న సైక్లిస్ట్​లు అందరితో మాట్లాడేశాం.. చివరకు ఓ మంచి సైకిల్​ కొనేశాం! మరి నెక్స్ట్​ ఏంటి? ఎలా మొదలుపెట్టాలి? రోజుకు ఎంత దూరం తొక్కాలి? ఏ రూట్లలో వెళ్లాలి? బైక్ మెయింటెనెన్స్​ సంగతేంటి? ఎంతో కీలకమైన ప్రశ్నలివి. ఈ విషయాలపై స్పష్టత లేకనే అనేక మంది సైక్లింగ్​ను మధ్యలోనే ఆపేస్తుంటారు. వేల రూపాయలు పోసి కొన్న సైకిల్​ను ఇంట్లో ఓ మూలన పెట్టి ఉంచుతారు.

షార్ట్ అండ్ స్వీట్ : వేల కిలోమీటర్లు సైక్లింగ్ చేసిన గీతాకృష్ణ మొదట్లో రోజుకు 5 కిలోమీటర్లు మాత్రమే తొక్కేవారు. ఆ తర్వాత క్రమంగా 10-20-30.. ఇలా పెంచుకుంటూ వెళ్లారు. మీరూ అంతే. ఎంత దూరం వెళ్లాలి అనే లెక్కలు వేసుకోవద్దు. మీ శరీరం మాట వినండి. బాడీ కంఫర్ట్​ బట్టి చిన్నచిన్న రైడ్స్​ చేయండి. నెమ్మదిగా పెంచండి. ట్రాఫిక్​ తక్కువగా ఉండే రోడ్లు ఎంచుకోండి. వీలైతే చుట్టూ పచ్చదనం ఉండే రూట్లలో హాయిగా విహరించండి.

నొప్పులు వస్తే.. : సైక్లింగ్ ప్రారంభించిన కొత్తలో ఒళ్లు నొప్పులు రావచ్చు. కంగారు పడొద్దు. ఇప్పటివరకు అలవాటు లేని శారీరక శ్రమ చేయడం వల్ల వస్తుందా లేక బైక్​ ఫిట్​లో ఏమైనా తేడా ఉందా అనేది తెలుసుకునేందుకు ప్రయత్నించండి. మొదటిది అయితే.. కొద్దిరోజులకే శరీరం అలవాటు పడుతుంది. రెండోది అయితే.. సీట్ హైట్​, హ్యాండిల్ పొజిషన్​ ఏమైనా అడ్జెస్ట్ చేయాలేమో చూసుకోండి. పిరుదులు నొప్పి వస్తుంటే జెల్​ ప్యాడెడ్ షార్ట్స్​ ట్రై చేయండి.

తాగుతూ.. తొక్కుతూ.. : సైకిల్​కు ఇంధనం అవసరం లేదు. కానీ.. మీ శరీరానికి మాత్రం మంచినీళ్లు తప్పనిసరి. సైక్లింగ్ చేసేటప్పుడు తరచూ నీళ్లు తాగాలి. దాహం వేయకపోయినా.. ఎప్పటికప్పుడు నీళ్లు తాగడం మంచిది. లాంగ్ రైడ్స్ చేస్తుంటే ఓఆర్​ఎస్, సరిపడా ఆహారం తీసుకోవాలి.

మీరే మెకానిక్.. : సైకిల్​ను రెగ్యులర్​గా ప్రొఫెషనల్ మెకానిక్​తో సర్వీసింగ్ చేయిస్తూ ఉండాలి. అయితే.. కొన్ని చిన్నచిన్న సమస్యలు వస్తే మనమే పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉండాలి. ఉదాహరణకు.. లాంగ్ రైడ్​కు వెళ్లినప్పుడు పంక్చర్​ పడితే.. మనకు దగ్గర్లో సైకిల్ షాప్ ఉండకపోవచ్చు. అప్పుడు మనమే ట్యూబ్ మార్చుకోవాలి. అందుకోసం అవసరమైన టూల్స్, స్పేర్ ట్యూబ్స్​, ఎయిర్ పంప్ ఎప్పుడూ వెంట ఉంచుకోవాలి. పంక్చర్, ఇతర చిన్న రిపెయిర్​లు ఎలా చేయాలో ఆన్​లైన్​లో చూసి నేర్చుకోవచ్చు. కొన్ని సైక్లింగ్ క్లబ్స్, స్టోర్స్ అప్పుడప్పుడు ట్రైనింగ్ సెషన్స్​ కూడా నిర్వహిస్తుంటాయి. వీటితోపాటు.. సైకిల్​ను ఎప్పుటికప్పుడు ఇంటి దగ్గర శుభ్రం చేసుకుని, అవసరమైన లూబ్రికెంట్ వేయడం తప్పనిసరి. అలా చేస్తేనే.. లాంగ్ రైడ్స్​కు వెళ్లినప్పుడు సమస్యలు రావు.

cycling photos
హైదరాబాదీ సైక్లిస్టులు

స్నేహితులతో ఫన్​ రైడ్స్​ : ఫిట్​గా మారాలన్న ఆలోచన, బరువు తగ్గాలన్న కసితో మాత్రమే సైక్లింగ్ చేయకండి. కాస్త ఫన్​ జోడించండి. స్నేహితులతో కలిసి ఆడుతూపాడుతూ రైడ్ చేయండి. మీ దగ్గర్లోని సైక్లింగ్ క్లబ్​లో చేరండి. వాళ్లు నిర్వహించే గ్రూప్​ రైడ్స్​లో పాల్గొనేందుకు ప్రయత్నించండి. అప్పుడు శారీరకంగా శ్రమ పడుతున్నామనే భావనే మీకు రాదు. సైక్లింగ్​తో ప్రేమలో పడిపోతారు.

cycling group ride pic
గ్రూప్​ రైడ్​లో హైదరాబాదీ సైక్లిస్టులు

రికార్డ్.. ట్రాక్​.. ప్రోగ్రెస్ : ఈవారంలో రోజూ 5 కిలోమీటర్లు రైడ్ చేద్దాం.. వచ్చే వారం 7 కిలోమీటర్లకు పెంచుదాం.. ఇలా టార్గెట్స్​ సెట్ చేసుకుంటే సైక్లింగ్​లో సులువుగా పురోగతి సాధించవచ్చు. అయితే.. ఈరోజు ఎంత దూరం, ఎంత స్పీడ్​తో వెళ్లామో తెలుసుకుని.. రేపటికి లక్ష్యాలు నిర్ణయించుకునేందుకు స్మార్ట్​ఫోన్​ యాప్స్​ ఉపయోగపడతాయి. మనం రైడ్ మొదలుపెట్టినప్పుడే రికార్డ్ బటన్ క్లిక్ చేస్తే.. పూర్తయ్యాక అన్ని వివరాలు వచ్చేస్తాయి. Strava, Google Fit, Relive సైక్లిస్టులు ఎక్కువగా ఉపయోగించే యాప్స్​. వీటిలో Strava బాగా ప్రాచుర్యం పొందింది. ఫేస్​బుక్ తరహాలో ఫ్రెండ్స్​ పోస్ట్​లు, ఫొటోలు, లైక్స్, కామెంట్స్​, గ్రూప్స్​ వంటి ఫీచర్స్ ఇందులో ఉంటాయి.

సెల్ఫ్​ ఛాలెంజెస్​ : ఒక్కోసారి మన ఇంటికి సైక్లింగ్​ క్లబ్​లు దూరంగా ఉండొచ్చు. గ్రూప్​ రైడ్స్​ కుదరకపోవచ్చు. అయినా నిరాశ చెందొద్దు. మీకు మీరే సెల్ఫ్​ ఛాలెంజ్​లు సెట్ చేసుకోండి. అంటే.. వారంలో కచ్చితంగా 5 రోజులు రైడ్ చేయాలి; నెలలో కనీసం ఒక్క సెంచరీ రైడ్.. ఇలా! స్ట్రావా వంటి యాప్స్​.. ఈ సెల్ఫ్​ ఛాలెంజ్​లు చేసేందుకు ఉపయోగపడతాయి.

అదే అసలు సవాల్..
సైక్లింగ్​ మొదలుపెడితే ప్రపంచం సరికొత్తగా కనిపిస్తుంది. వేకువజామునే నగర విహారం.. సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. ట్రాఫిక్​ జామ్​ల మధ్య రోజూ విసుగుగా, నెమ్మదిగా ప్రయాణాలు సాగే సిటీ రోడ్లపై.. ఉదయాన్నే ఎలాంటి చికాకులు లేకుండా దూసుకెళ్లొచ్చు. ఇదంతా నాణేనికి ఓవైపే. కాస్త ఆలస్యమైతే.. సైక్లిస్ట్​లకు చుక్కలే. ఉరుకులపరుగుల జీవితంలో నేను మాత్రం త్వరగా గమ్యం చేరుకుంటే చాలనుకునే వాహనదారుల మధ్య సైక్లిస్ట్​లకు భద్రత కరవు. ఇదే.. సైకిల్​ను రవాణా సాధనంగా ఉపయోగించడంలో వెనుకడుగు వేసేందుకు కారణం. పర్యావరణహిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించాలన్న ఐరాస వంటి సంస్థల ఆశయ సాధనకు ప్రధాన ఆటంకం.

Hyderabad Cycle track : సైక్లింగ్ ట్రాక్​.. ఈ సమస్యకు తిరుగులేని పరిష్కారం. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక అడుగు వేశాయి. స్మార్ట్​సిటీ ప్రాజెక్టులో భాగంగా సైక్లింగ్ ట్రాక్​ ఏర్పాటుకు నిధులు కేటాయించింది నరేంద్ర మోదీ సర్కార్. అనేక రాష్ట్రాల ప్రభుత్వాలూ చొరవు చూపాయి. ప్రధాన నగరాల్లో సైక్లింగ్ ట్రాక్​లు నిర్మించాయి. అయితే.. వాటి లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరలేదు. అనేక చోట్ల ఈ సైక్లింగ్ ట్రాక్​లు.. అనధికార పార్కింగ్​ ప్రదేశాలుగా మారిపోయాయి. హైదరాబాద్​ కేబీఆర్​ పార్క్​ దగ్గరి సైక్లింగ్ ట్రాక్.. ఇందుకొక ఉదాహరణ.

hyderabad cycling revolution
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్​లో సైక్లిస్టుల ప్రదర్శన

Hyderabad Cycling Revolution : నగర రహదారుల్ని సైక్లింగ్ ఫ్రెండ్లీ-సేఫ్​గా మార్చాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ గళం విప్పుతున్నారు హైదరాబాద్​ సైక్లిస్టులు. ఇందుకోసం జంట నగరాల్లోని ప్రధాన సైక్లింగ్ క్లబ్స్​ అన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. 'హైదరాబాద్​ సైక్లింగ్ రివల్యూషన్​' పేరుతో ప్రదర్శనలు నిర్వహిస్తూ.. పాలకుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. యాక్టివ్​ మొబిలిటీని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో మే 7న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా చేపట్టిన 'హైదరాబాద్​ సైక్లింగ్ రివల్యూషన్​ 3.0'కు తెలంగాణ ప్రభుత్వం, టీఎస్​ఆర్​టీసీ, మరికొన్ని దిగ్గజ సంస్థలు మద్దతు ఇవ్వడం సానుకూలాంశం. హైదరాబాద్​ ఔటర్​ రింగ్​ రోడ్​ సర్వీస్​ రోడ్​పై.. తెలంగాణ ప్రభుత్వం 21 కిలోమీటర్ల సోలార్​ రూఫ్​ సైక్లింగ్ ట్రాక్ నిర్మించడం మరో గొప్ప విషయం. అయినా.. ఇంకా చేయాల్సింది ఎంతో ఉందన్నది వాస్తవం. అదే సమయంలో.. సైక్లింగ్​ కోసం ప్రభుత్వం నిధులు కేటాయించి, కొత్త ప్రాజెక్టులు చేపట్టినంత మాత్రాన సమస్య పరిష్కారమైపోదు. ఈ రోడ్లపై సైక్లిస్ట్​లకూ హక్కు ఉంటుందని, వారూ క్షేమంగా ప్రయాణించేందుకు సహకరించాలన్న ఆలోచన.. మోటర్ వాహనదారుల్లో రావడం ఎంతో ముఖ్యం. అప్పుడే.. 'సైక్లింగ్​ ఫ్రెండ్లీ​ సిటీ' సాధ్యం!

ఆటో అన్న.. బైక్​ బాబాయ్.. కార్​ అంకుల్.. జర సైక్లిస్ట్​ను కూడా చూడండయ్యా! రోడ్​పై కాస్త జాగా వదిలి పక్క నుంచి వెళ్లండయ్యా!!

--జీఎస్​ఎన్​ చౌదరి.

road cycle sunset pics
సూర్యాస్తమయం వేళ సైక్లింగ్​తో ఎంతో ఫన్​!
road bike photos
సముద్ర తీరాన రోడ్ బైక్​
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Jun 14, 2023, 4:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.