ETV Bharat / sukhibhava

పళ్లు జివ్వుమని ఎందుకు లాగుతాయి? దానికి పరిష్కారం ఏంటి? - పళ్ళు జివ్వుమనడం

మన శరీరంలోని ప్రతి అవయవం ఎంతో ప్రత్యేకమైనది. అది చేసే పని ఆధారంగా దానికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. మన శరీరంలో అన్ని క్రియలకు అవసరమైన ఆహారాన్ని నోటి ద్వారా తీసుకుంటూ ఉంటాము. ఇలా నోటి ద్వారా ఆహారాన్ని తీసుకున్నప్పుడు దానిని నమలడం, తర్వాత దానిని మింగడం చేయాలి. అయితే వేడి లేదంటే చల్లటి ఆహారాన్ని తీసుకునే సమయంలో కొంతమంది పళ్లు జివ్వుమని లాగుతుంటాయి. దీనికి కారణాలు ఏంటో తెలుసుకుందాం.

tooth-sensitivity
tooth-sensitivity
author img

By

Published : Mar 7, 2023, 9:23 AM IST

Updated : Mar 7, 2023, 9:37 AM IST

మన శరీరానికి కావాల్సిన శక్తి ఆహారం ద్వారా అందుతుంది. ఆహారాన్ని మనం నోటి ద్వారా తీసుకుంటూ ఉంటాం. ఇలాంటి ఆహారం చల్లగా లేదంటే వేడిగా ఉండవచ్చు. ఈరకంగా చల్లటి లేదంటే వేడి ఆహార పదార్థాలను తీసుకుంటే కొంతమంది పళ్లు జివ్వుమని లాగుతుంటాయి. భరించలేనంత నొప్పిగా అనిపిస్తుంటుంది. అసలు ఈ సమస్యకు కారణం ఏమిటి? ఇది వంశపారం పర్యంగా వస్తుందా? దీనికి పరిష్కారం ఏంటనే పలు అంశాలను ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

చల్లటి లేదంటే వేడి పదార్థాలను తీసుకున్నప్పుడు పళ్లు జివ్వుమని కొంతమందిలో లాగడానికి కారణం పళ్ల స్వరూపంలో కలిగిన మార్పులు కారణం అని వైద్యులు చెబుతుంటారు. అందువల్లే భరించలేనంత నొప్పిని అనుభవించాల్సి వస్తుందని అంటారు. సాధారణంగా పళ్ల మీద పింగాణి ఎనామిల్ ఉంటుంది. ఇది పళ్లను రక్షించే ఒక వంటి రక్షణ కవచం.

పళ్లను రక్షించే పింగాణి ఎనామిల్ కింద డెంటింగ్ అనే పొర ఉంటుంది. ఇది మరో రకమైన రక్షణ కవచంలా చెప్పుకోవచ్చు. దాని కింద పంటికి సంబంధించిన నరాలు, రక్తనాళాలు ఉండే పల్ప్ లాంటి పదార్థం ఉంటుంది. పంటి మీద ఎనామిల్ గట్టిగా ఉన్నంత కాలం పంటికి ఎలాంటి ఇబ్బందిరాదు. ఎప్పుడైతే పంటికి రక్షణగా ఉండే ఎనామిల్ దెబ్బతింటుందో అప్పుడు వేడిగా లేదంటే చల్లగా ఏదైనా తిన్నప్పుడు జివ్వుమని లాగే సమస్య మొదలవుతుంది. అయితే పంటికి రక్షణనిచ్చే ఎనామిల్ దెబ్బతినడానికి రకరకాల కారణాలు ఉండవచ్చని అంటున్నారు ప్రముఖ ప్రోసతోడొంటిస్ట్ డా.గోపినాథ్ అన్నే.

ఎక్కువగా బ్రషింగ్ చేయడం వల్ల పంటి ఎనామిల్ దెబ్బతినడానికి అవకాశం ఉంటుందని డా.గోపినాథ్ అంటున్నారు. కొన్నిసార్లు యాసిడ్ ఎఫెక్ట్ వల్ల పంటి ఎనామిల్ దెబ్బతిని డెంటింగ్ బహిర్గతం అవడం వల్ల కూడా ఇలాంటి సమస్య తలెత్తవచ్చు అని వివరించారు. మరికొన్నిసార్లు వంశపారంపర్యంగా కూడా ఇలాంటి సమస్య రావడానికి ఆస్కారం ఉంటుందని పేర్కొంటున్నారు. కొంతమందిలో ఎనామిల్ సహజంగానే పలుచగా ఉండవచ్చని అంటున్నారు.

పరిష్కారం ఏంటంటే?
వేడివి లేదంటే చల్లటి ఆహార పదార్థాలు తిన్నప్పుడు జివ్వుమని లాగే సమస్య నుండి ఉపశమనం కోసం సాధారణంగా పళ్లకు సిమెంట్ వేయడం అనే ప్రక్రియ ఎంతో ప్రాచుర్యం పొందింది. రసాయనాలతో పంటి ఎనామిల్ దెబ్బతిన్న ప్రాంతాలను రక్షించేలా వైద్యులు ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తారు. లేదంటే పళ్లకు తొడుగులు వేయడం ద్వారా కూడా ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.

60 సంవత్సరాల డయాబెటిస్ పేషెంట్ కట్టుడు పళ్లు పెట్టించుకోవాలంటే.. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
వయసు పైబడిన వారిలో సాధారణంగా అన్ని పళ్లు రాలిపోతాయి. అయితే ఇలాంటి వాళ్లు పెట్టుడు పళ్లను పెట్టించుకుంటే సరిపోతుంది. అయితే డయాబెటిస్​తో బాధపడే వాళ్లు కూడా సాధారణ వ్యక్తుల మాదిరిగానే పెట్టుడు పళ్లను పెట్టించుకోవచ్చు. సాధారణంగా పెట్టుడు పళ్లు పెట్టించుకోవడానికి రకరకాల మార్గాలు ఉన్నాయని వైద్యులు వివరిస్తున్నారు.

పూర్తిగా పళ్లు ఊడిన వాళ్లు డెంచర్స్ అనే పూర్తి పళ్ల సెట్ ని పెట్టించుకోవచ్చని ప్రముఖ డెంటిస్ట్ డా.ఎం.ఎస్. రంగారెడ్డి వివరిస్తున్నారు. డెంచర్స్ అనే పళ్ల సెట్​ను అవసరమైనప్పుడు నోటిలో పెట్టుకొని, తర్వాత తీయడానికి వీలవుతుంది. అలాగే ఈ పళ్ల సెట్​ను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్లో ప్రస్తుతం ఇంప్లాంట్స్ లేదంటే ఇంప్లాంట్ సపోర్టెడ్ డెంచర్స్ అనేది పెట్టుడు పళ్లకు ఎంతో పాపులర్ అని డా.ఎం.ఎస్ రంగారెడ్డి వివరిస్తున్నారు. నోటి ఎముక బలంగా ఉన్న వాళ్లు శాశ్వతంగా నిలిచిపోయే ఈ పళ్లను పెట్టించుకోవచ్చు. ఎంతటి గట్టి పదార్థాలనైనా నమలడానికి ఈ ఇంప్లాంట్స్ అవకాశం కల్పిస్తాయని వైద్యులు వివరిస్తున్నారు.

Last Updated : Mar 7, 2023, 9:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.