ప్రస్తుత కాలంలోని ఉరుకులపరుగుల జీవితంలో ప్రతిఒక్కరూ శృంగారానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు. అలా కొంతమంది ఉద్యోగాల్లో వివిధ షిఫ్టుల కారణంగా సెక్స్‌ను ఎంజాయ్ చేయలేకపోతున్నారట. ఆ విధంగా నైట్ షిఫ్ట్ చేసే వారు పగలు వయాగ్రా వేసుకొని శృంగారంలో పాల్గొనవచ్చా? అనేది కొందరినికి వస్తున్న ప్రశ్న. అయితే అందుకు వైద్య నిపుణలు ఇచ్చే సలహా, సూచనలు ఏమిటో తెలుసుకుందాం.
నైట్ డ్యూటీ చేసేవాళ్లు.. పగలు వయాగ్రా వేసుకుని శృంగారంలో పొల్గొనవచ్చా?
అవసరం ఉంటే వేసుకోవాలి. రాత్రి, పగలు అని తేడా లేకుండా ఎప్పుడైనా వయాగ్రా తీసుకోవచ్చు. అయితే శృంగారానికి అరగంట లేదా గంట ముందు వయాగ్రా తీసుకుంటే మంచిది. అదే గంట ముందు అయితే ఇంకా ఉత్తమం. వయాగ్రా మాత్రల అవసరం ఉంటే అవి తీసుకోవడంలో తప్పు లేదు. కానీ, గుండె జబ్బు ఉన్న వాళ్లు వీటికి దూరంగా ఉంటే మంచిది. అయితే ఈ మాత్రను తీసుకోవడం వల్ల కొందరి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. తలనొప్పి, నడుంనొప్పి, కండరాల నొప్పి, కడుపులో వికారంతో పాటు శరీరమంతటా ఆందోళనకర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఒకవేళ సైడ్ఎఫెక్ట్స్ లేకపోతే నిరభ్యంతరంగా వయాగ్రా తీసుకోవచ్చు. వయాగ్రాను తొలుత ఊపిరితిత్తుల సమస్యలతో పాటు లోబీపీ పేషెంట్ల కోసం వాడేవాళ్లు. ఈ మాత్ర తీసుకోవడం వల్ల రక్తనాళాలలో రక్త ప్రసరణను పెంచుతుంది. అంతకంటే వయాగ్రా చేసే పనేమి లేదు. కానీ, డాక్టర్ సలహా లేకుండా ఏ మందు వాడకూడదు.
సరైన నిద్ర లేకపోతే సెక్స్ డౌన్ అవుతుంది అంటారా?
కచ్చితంగా డౌన్ అవుతుంది. శరీరానికి సరైన నిద్ర లేనప్పుడు చెడు పదార్థాలు అన్నీ అలానే ఉంటాయి. కానీ, ఎప్పుడైన కంటినిండా నిద్ర పోతారో.. వారిలో చెడు పదార్థాలన్నీ తొలగిపోతాయి. రిలాక్స్‌గా ఫీల్ అవుతారు. సరైన నిద్ర ఉంటే శారీరికంగా, మానసికంగా ఆరోగ్యం ఉండడం సహా ఎంతో ఉల్లాసంగా ఉంటారు. ఎప్పుడైతే సరైన నిద్ర లేనప్పుడు సెక్స్ చేయాలన్న కోరిక కూడా తగ్గిపోతుంది. సెక్స్‌లో బాగా పాల్గొనాలంటే కంటినిండా నిద్ర పోవాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి.. ఒత్తిడితో శృంగార జీవితంపై ప్రభావం.. నిజమెంత?