Sunstroke Remedy: పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఈ వేసవికాలంలో ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఒకే రకంగా ఉంటుంది. తీవ్రమైన ఎండా, వేడితో శరీరంలోని నీరు, లవణాలన్నీ చెమట రూపంలో బయటకు వెళ్లిపోతాయి. దీంతో శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ కుప్పకూలిపోతుంది. దీనినే వడదెబ్బ అంటారు. ఎండాకాలం మొదలైన నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
- మధ్యాహ్నం సమయాల్లో ప్రయాణాలు చేయకూడదు
- కొబ్బరి నీళ్లు, పెరుగు, మజ్జిగ, చెరకు రసం లాంటి పానియాలు తాగాలి
- వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే చల్లటి వాతావరణంలోకి తీసుకెళ్లాలి
- శరీరంపైన దుస్తులను వదులుగా చేసి గాలి బాగా తగిలేలా చూడాలి
- వేసవిలో విరివిగా లభించే మామిడి పూత వడదెబ్బకు మంచి ఔషధం
మామిడి పువ్వు, ఉడికించి తీసిన మామిడి గుజ్జు కిలో చొప్పున చక్కెర 2 కిలోల చొప్పున కలుపుకుని పొయ్యి పైన పెట్టి వేడిచేయాలి. ఈ మిశ్రమం పాకంగా మారే సమయంలో మిరియాల పొడి, సైందవ లవణం 10 గ్రాముల చొప్పున కలిపి దించుకోవాలి. ఆ పదార్థాన్ని శుభ్రమైన గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. గ్లాసు నీటిలో రెండు చెంచాలు కలుపుకొని ప్రతిరోజు తాగితే వడదెబ్బ తగలకుండా రక్షించుకోవచ్చు. ఆకలి లేకపోవడం, నోరు ఎండిపోవడం, శారీరక బలహీనతలకు కూడా ఇది చక్కటి పరిష్కారం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: రూ.30వేల సర్జరీతో 'కన్యత్వం' వాపస్! భవిష్యత్లో సమస్యలు రావా?