ETV Bharat / sukhibhava

మీ కిడ్నీలు ఆరోగ్యంగానే ఉన్నాయా? ఇలా తెలుసుకోండి!

కిడ్నీ సమస్య వస్తే ఆసుపత్రి చుట్టూ తిరగాల్సిందే. సమస్యలు తీవ్రమైతే కిడ్నీల మార్పిడి చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు ఏం చేయాలి? కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయో లేవో ఎలా తెలుసుకోవాలంటే?

కిడ్నీ
కిడ్నీ
author img

By

Published : Jul 13, 2022, 10:45 AM IST

కిడ్నీ జబ్బులు వస్తే శరీరం పనితీరులో మార్పు స్పష్టంగా తెలుస్తుంది. ఒకసారి కిడ్నీ జబ్బు వస్తే ఆసుపత్రి చుట్టూ తిరగాల్సిందే. అవి పూర్తిగా దెబ్బతింటే మార్పిడి చేసుకోక తప్పదు. ఇలాంటి ఇబ్బందులను అధిగమించడానికి క్రియాటినైన్‌ పరీక్ష చేస్తే సాధ్యమవుతుంది. తరచుగా క్రియాటినైన్‌ పరీక్ష చేయించుకుంటే కిడ్నీల పనితీరు తెలిసిపోతుందని ప్రముఖ నెఫ్రాలజిస్టు డాక్టర్‌ శశిధర్‌ వివరించారు.

క్రియాటినైన్‌ ఇలా..
సిరమ్‌ క్రియాటినైన్‌ పరీక్షతో శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాల తీరు తెలిసిపోతుంది. శరీర కండరాలు దెబ్బతినడం, తీసుకునే ఆహారంతో కూడా క్రియాటినైన్‌ ఎంతుందో తెలుస్తుంది. సాధారణంగా 0.8 నుంచి 1.2 వరకు ఉంటుంది. ఎక్కువగా ఉంటే కిడ్నీలు పనిచేయడంలో ఎక్కడో లోపం ఉందని తెలుస్తుంది. ఇలాంటి వారికి ఆకలి ఉండదు. వాంతులు అవుతాయి. కాళ్లవాపులు కూడా వస్తాయి.

దీర్ఘకాల వ్యాధులుంటే..
క్రియాటినైన్‌ పెరుగుదల అందరిలో ఒకే రకంగా ఉండదు. మధుమేహం ఉన్న వారికి ఒక విధంగా, అధిక రక్తపోటు ఉంటే మరొలా ఉంటుంది. బీపీ, షుగర్‌ తగ్గించుకుంటే క్రియాటినైన్‌ను తగ్గించుకోవచ్చు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి : ఆరోగ్యం కోసం వంటల్లో ఏ నూనె వాడాలంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.