ETV Bharat / sukhibhava

యవ్వనంలో స్లిమ్​గా ఉండి - ఆ తర్వాత బరువు పెరిగారా? అసలైన కారణమిదే! - causes of weight gain middle age

Reasons for Weight Gain in Middle Age: కొంతమంది నవ యవ్వనంలో మెరుపు తీగలా ఉంటారు. కానీ.. నాలుగు పదులు దాటగానే శరీరాకృతి మారిపోతుంది. ఇలా నడి వయసులో బరువు పెరగడానికి ప్రధాన కారణాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Reasons for Weight Gain in Middle Age
Reasons for Weight Gain in Middle Age
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 14, 2023, 3:54 PM IST

Reasons for Weight Gain in Middle Age: నేటి తరాన్ని ఆరోగ్య పరంగా వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో అధిక బరువు ఒకటి. ఈ ప్రాబ్లం నుంచి బయటపడేందుకు.. జనాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. వ్యాయామం, డైట్ అంటూ మొదలు పెడతారు. కానీ.. కొన్ని రోజుల తర్వాత వదిలేస్తారు. దీంతో.. సమస్య మళ్లీ మొదటికి వస్తుంది. బరువు పెరగడం చిటికెలో పని.. కానీ.. అదే బరువు తగ్గడానికి చాలా సమయం పడుతుంది.

కొంతమంది నవ యవ్వనంలో మెరుపు తీగలా ఉంటారు. కానీ, నాలుగు పదులు దాటగానే శరీరాకృతి మారిపోతుంది. అందుకు సంబంధించి.. ఎన్ని వ్యాయామాలు చేసినా బరువు తగ్గడం సాధ్యం కాదు. ఇలా నడి వయసులో బరువు పెరగడానికి ప్రధాన కారణం.. ఆహారంలో కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం. నిజానికి, కార్బొహైడ్రేట్లు లభించే ఆహార పదార్థాలు కూడా మనకు ముఖ్యమైనవే. కాకపోతే మోతాదు మించకూడదని నిపుణులు చెబుతున్నారు.

మీకు బ్లూ టీ గురించి తెలుసా? బరువు తగ్గి నాజూగ్గా మారిపోతారు!

65 ఏళ్ల లోపు వారిపై అధ్యయనం: బీఎంజే జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం.. సిరి ధాన్యాలు, పండ్లు, గంజి పదార్థాలు లేని కూరగాయలు తింటే నడి వయసులో తక్కువ బరువు పెరుగుతాం. మరోవైపు రిఫైన్డ్‌ ధాన్యాలు, గంజి పదార్థం ఉండే కూరగాయలు, చక్కెర కలిగిన పానీయాలు ఊబకాయానికి దారితీస్తాయి. 65 సంవత్సరాల లోపు వయసు కలిగిన 1లక్షా 36వేల 432 మంది నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అధ్యయనం చేశారు.

బరువు తగ్గడానికి "వాటర్ థెరపీ" - జస్ట్ నీళ్లు తాగితే చాలు కొండలాంటి పొట్ట వెన్నలా కరిగిపోతుంది!

సర్వేలో పాల్గొన్నవారంతా తమ పేరు నమోదు చేసుకున్న సమయంలో పరిపూర్ణ ఆరోగ్యవంతులే. తమ ఆహారం, జీవనశైలి, ఇతర ఆరోగ్య విషయాల గురించి పరిశోధకులకు సమగ్ర సమాచారం అందించారు. 2 నుంచి 4 సంవత్సరాల చొప్పున.. 24 సంవత్సరాల వ్యవధిలో వివరాలను సేకరించారు. సర్వేలో పాల్గొన్నవారు ప్రతి నాలుగు సంవత్సరాలు 1.5 కిలోలు, మొత్తం 24 ఏండ్ల కాలంలో 8.8 కిలోల బరువు పెరిగారు. అయితే, వీరిలో ఎక్కువగా రిఫైన్‌ చేసిన ధాన్యాలు, యాడెడ్‌ షుగర్స్‌, చక్కెర పానీయాలు, బఠానీలు, మొక్కజొన్న, ఆలుగడ్డలు లాంటి గంజి పదార్థం ఉన్న కూరగాయలను తిన్నవాళ్లు ఎక్కువ బరువు పెరిగారని అధ్యయనంలో స్పష్టం చేశారు.

మహిళల్లో అధిక బరువా? కారణం తిండి కాకపోవచ్చు!

సిరి ధాన్యాల నుంచి వచ్చే కార్బొహైడ్రేట్లు, ఫైబర్‌, పండ్లు, బ్రొకోలి, క్యారెట్‌, పాలకూర లాంటి గంజి పదార్థం లేని కూరగాయలు తీసుకున్నవారేమో తక్కువ బరువు పెరిగారట. పైగా బరువు పెరగడానికి, ఆహారానికి మధ్య సంబంధం అనేది.. అప్పటికే బరువు అధికంగా మహిళల్లో మరింత ఎక్కువగా ఉందట. కాబట్టి మధుమేహం, గుండె రోగాలు, క్యాన్సర్‌ ముప్పు తగ్గించుకోవడానికి సిరిధాన్యాలు, గంజి లేని కూరగాయలు, పండ్లు తినడం ఉత్తమమని అధ్యయనంలో స్పష్టం చేశారు.

పెళ్లి తర్వాత బరువు పెరిగారా? - ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్ ఫిగర్ పక్కా!

ఈజీగా బరువు తగ్గాలా? తిన్న తర్వాత నీరు ఇలా తాగి చూడండి!

Health Benefits Of Seeds : బరువు తగ్గాలా?.. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలా?.. అయితే ఈ గింజల్ని ట్రై చేయండి!

Cardamom For Weight Loss : అధిక బరువు, జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా?.. యాలకులతో చెక్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.