New Year Resolution 2024 Weight Loss : "ఇప్పటిదాకా జరిగిందేదో జరిగిపోయింది.. ఈ కొత్త సంవత్సరం నుంచి పొట్ట తగ్గించాలి.. ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్లాలి.." అంటూ చాలా మంది న్యూ ఇయర్ నిర్ణయాలు తీసుకుంటారు. యోగా కేంద్రాలు, జిమ్‌లలో కూడా కొందరు జాయిన్ అవుతారు. కానీ చాలా మంది ఆరంభ శూరులుగానే మిగిలిపోతారు. అయితే.. నిజంగా బరువు తగ్గాలనేవారు చిత్తశుద్ధితో పై పనులు చేయండి. వాటితోపాటు ఈ సూపర్ డైట్ ఫాలో అయ్యారంటే.. స్లిమ్‌గా మారిపోతారు.
బూడిద గుమ్మడి రసం : ముందుగా మీరు గింజలు లేకుండా పొట్టు తీసిన కొన్ని బూడిద గుమ్మడి ముక్కలు సిద్ధం చేసుకోవాలి. వాటిలో ఒక అల్లం ముక్క వేసి జ్యూసర్లో రుబ్బుకోవాలి. అనంతరం దానికి 1 నుంచి 2 టీస్పూన్ల తేనె యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే రెండు టీస్పూన్ల నానబెట్టిన చియా గింజలని ఆ మిశ్రమంలో కలుపుకోవాలి. అంతే టేస్టీ బూడిద గుమ్మడి జ్యూస్ రెడీ.
రాగి జావ : మీరు బరువు తగ్గడానికి తోడ్పడే మరో మంచి హెల్తీ ఫుడ్.. రాగి జావ. దీనిని ఎలా తయారుచేసుకోవాలంటే.. ముందుగా ఒక బౌల్లో మీరు తాగే పరిమాణంలో వాటర్ తీసుకొవాలి. అవి కాస్త మరిగాక.. రెండు టీస్పూన్ల రాగి పిండిని ఆ వాటర్‌లో యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. అలా కాసేపు మరిగాక.. దానిని ఒక గ్లాసులోకి తీసుకొని కొన్ని కట్ చేసిన ఆపిల్ లేదా అరటిపండు ముక్కలు, నానబెట్టి పొట్టు తీసిన 4 బాదంపప్పులు, 3 గింజలు లేని ఖర్జూరాలు, 1 టీస్పూన్ కాల్చిన అవిసె గింజల పొడిని యాడ్ చేసుకోండి. అవసరమైతే తేనెను కూడా కాస్త కలుపుకోండి. అంతే ఎంతో రుచికరమైన హెల్తీ రాగి జావ సిద్ధం.
సడెన్‌గా బరువు తగ్గిపోతున్నారా? షుగర్ ఉన్నవారిలో ప్రోటీన్ లాస్‌కు కారణం అదే!
రోల్డ్ ఓట్స్ స్మూతీ : ఇది కూడా బరువు తగ్గడానికి బెస్ట్ హెల్తీ ఫుడ్. ముందుగా 2-3 టేబుల్ స్పూన్ల రోల్డ్ ఓట్స్‌ను ఒక 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని మిక్స్ జార్‌లోకి తీసుకొని మీ అవసరాన్ని బట్టి.. నీళ్లు లేదా కొన్ని పాలు యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా సగం బాగా పండిన అరటిపండు ముక్కలు, 4-5 స్ట్రాబెర్రీలు, 4 నానబెట్టిన బాదంపప్పులు, ½ఒక కప్పు వేయించిన పల్లీలు, 1 టీస్పూన్ వేయించి అవిసె గింజలు, 2 టీస్పూన్ల చియా గింజలను ఆ మిశ్రమానికి కలిపి ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇక చివరగా గుమ్మడి కాయ గింజలతో గార్నిష్ చేసుకోండి. అంతే హెల్తీ రోల్డ్ ఓట్స్ స్మూతీ రెడీ.
జింజర్ లైమ్ టీ : మీరు వెయిట్ లాస్ అవ్వడానికి జింజర్ టీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. కొన్ని వాటర్ తీసుకొని బాగా మరిగించుకోవాలి. అందులో ముందుగానే దంచిపెట్టుకున్న అల్లం ముక్కల్ని యాడ్ చేసుకొని కాస్త హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత దానిని గ్లాస్‌లోకి వడకట్టుకొని పోసుకోవాలి. అందులో లెమన్ పిండి.. కాస్త తేనె యాడ్ చేసుకోవాలంతే. వీటిని ఫాలో అయితే తప్పకుండా వెయిట్ లాస్ అవుతారు. ఈ ఏడాదైనా మీ తీర్మానం నిలబెట్టుకోండి మరి!
ఎన్ని చేసినా బరువు తగ్గడం లేదా? 30-30-30 రూల్ ట్రై చేస్తే అంతా సెట్!