ETV Bharat / sukhibhava

యోగా చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.. - meditation tips

Yoga Day 2022: ప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుతాల్లో యోగా ఒకటి. మన దేశంలో జన్మించి.. దశదిశలా వ్యాపించింది యోగా. వేదకాలం నుంచే భారత్​లో యోగా ఉంది. జీవనశైలిలో ఎన్ని హైటెక్ వసతులు భాగమైనా మానసిక కుంగుబాటుకు యోగా సాధనే సమాధానం. అందుకే 2015లో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. మంగళవారం ఎనిమిదో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకునేందుకు ప్రపంచం సిద్ధమైన వేళ.. ఈ ఏడాది ఇతివృత్తం.. ఆసనాల ప్రాధాన్యం.. చరిత్ర గురించి తెలుసుకుందాం.

International Yoga Day 2022
యోగా
author img

By

Published : Jun 21, 2022, 6:01 AM IST

జూన్​ 21.. అంతర్జాతీయ యోగా దినోత్సవం. శరీరంలో రోగనిరోధక శక్తిని సహజంగా పెంచే విధానాల్లో యోగా ఒకటి. వేదకాలం నుంచి ఆదికాలం వరకు సనాతన భారత సంప్రదాయంలోనే ఇమిడి ఉంది యోగా సాధన. పూర్వీకులు శారీరక, మానసికోల్లాసానికి యోగా ఆచరించారు. ప్రాచీనకాలంలో ఎందరో మునులు, యతులు, రుషులు, యోగులు తమ తపోనిష్టకు అనారోగ్యం అడ్డు కాకుండా కనిపెట్టిన ఆసనాలు, ఆచరించిన శ్వాస సంబంధిత ప్రాణాయామాలు ఇప్పుడు ‘యోగా’ పాఠాలుగా మారాయి. మానసిక సమస్యలకు పరిష్కారం, శారీరక రుగ్మతలకు సమాధానం, అధ్మాత్మికానుభూతికి ఆలవాలం యోగానే. జీవనశైలిలో ఎన్ని హైటెక్ వసతులు, పోకడలు భాగమైనా ప్రాచీన యోగా పద్ధతులతోనే ఫలితాలు సాధిస్తున్నారు చాలా మంది. మంగళవారం ఎనిమిదో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకునేందుకు ప్రపంచం సిద్ధమైన వేళ.. ఈ ఏడాది 'యోగా ఫర్ హ్యుమానిటీ' అనే థీమ్‌తో వేడుకలను నిర్వహించాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

.
.
.
.

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం సూచనతో జూన్​ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 2015లో ప్రకటించింది ఐక్యరాజ్యసమితి. యోగా అంటే కేవలం బరువు తగ్గడానికో, కొవ్వు కరిగించుకోవడానికో చేసే ఆసనాలే కాదు. దానితో చాలా లాభాలు ఉన్నాయి. మనిషి శారీరక దృఢత్వాన్నీ, ఏకాగ్రతను పెంచుకోవడానికి ఇది సాయపడుతుంది. అందుకే దీన్ని అనుసరించేవారి సంఖ్య ఏటా పెరుగుతోంది. మానసిక ఒత్తిడి, కుంగుబాటు నుంచి ఉపశమనం, శారీరక ఎదుగుదల, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంచుకోడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

.
.

గత శతాబ్దంలో యోగాలో విభిన్న ఆసనాలు ఆచరణలోకి వచ్చాయి. చాలా దేశాల్లో నగరాలు, పట్టణాల నుంచి పల్లెల వరకు యోగా శిక్షణాలయాలు వెలిశాయి. మన దేశంలోనూ స్థానికంగానే కాకుండా ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన యోగా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. చికిత్స దృక్పథంతో యోగాను జీవన విధానంగా సాధన చేస్తున్న వారూ లేకపోలేదు. మంత్రం, ముద్రలు, ఆసనం, ప్రాణాయామం, యోగానిద్ర, హఠయోగ క్రియలు వంటి ఆసనాల్లో తర్ఫీదు పొందుతున్నారు. విశ్వవ్యాప్తంగా ఎందరో యోగా సాధకులుగా, గురువులుగా కొనసాగుతున్నారు.

'రెస్టొరేటివ్​ యోగా'..

యోగాలో ఎన్నో ఆసనాలు, భంగిమలు ఉన్నా.. ఎక్కువమంది ఇష్టపడేది 'శవాసనం'. ఎందుకంటే ఎలాంటి కష్టం లేకుండా హాయిగా రిలాక్స్ కావచ్చు కదా..! మరి యోగా సెషన్ మొత్తం రిలాక్స్ కావడమే అయితే...? సాధారణ విశ్రాంతి భంగిమలకే కొంత యోగా ట్విస్ట్ ఇచ్చి అద్భుతమైన ఫలితాలను సాధించగలిగితే..? అలా వచ్చిందే 'రెస్టొరేటివ్​ యోగా'. ఈ మధ్యే పాపులర్ అవుతున్న ఈ ప్రత్యేకమైన యోగా గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

ఎక్కడిదీ యోగా..?

1950ల్లో మన యోగ శాస్త్రాన్ని పాశ్చాత్య దేశాలకు ప్రచారం చేసిన బి.కె.ఎస్.అయ్యంగార్ ఈ రెస్టొరేటివ్ యోగాను కనిపెట్టారు. ఆయన శిష్యులలో మొదటితరం వారైన జుడిత్ హాన్సన్ లాసేటర్ ఈ రెస్టొరేటివ్ యోగాను ప్రచారంలోకి తీసుకువచ్చారు. 1955లో ఆమె రాసిన 'రిలాక్స్ అండ్​ రెన్యూ: రెస్ట్​ఫుల్​ యోగా ఫర్​ స్ట్రెస్​ఫుల్​ టైమ్స్​' అనే పుస్తకం ఇందుకు ఎంతగానో తోడ్పడింది. తర్వాత ఆమె రెస్టొరేటివ్ యోగాలో స్పెషల్ టీచర్ సర్టిఫికేషన్‌ కూడా ప్రవేశపెట్టారు.

Yoga
రెస్టొరేటివ్​ యోగా

రెస్టొరేటివ్ యోగా అంటే..?

మన శరీర తత్వాన్ని బట్టి, ఫ్లెక్సిబిలిటీని బట్టి రకరకాల యోగాసనాలను సాధన చేస్తాం. మనం ఆశించిన ఫలితాలను పొందడానికి, శరీరాన్ని నిత్యం ఆరోగ్యంగా ఉంచడానికి క్రమం తప్పకుండా యోగ సాధన చేస్తుంటాం. అలాగే మానసిక ప్రశాంతత కోసం, ఏకాగ్రత కోసం ధ్యానాన్ని సాధన చేస్తాం. ఈ రెండిటి ప్రయోజనాలనూ ఏకకాలంలో అందించగలగడం రెస్టొరేటివ్ యోగా ప్రత్యేకత.

యోగా చేసేటప్పుడు ఎక్కువసేపు ఒకే పొజిషన్‌లో ఉండడం వల్ల శరీరానికి ఆ భంగిమను నెమ్మదిగా అలవాటు చేస్తూ అందులోని పూర్తి లాభాలను పొందడమే రెస్టొరేటివ్ యోగా ఫార్ములా. శరీరానికి, మనసుకు విశ్రాంతినిస్తూనే అధిక బరువును తగ్గించడం రెస్టొరేటివ్ యోగా సక్సెస్ కావడానికి ప్రధాన కారణం. ఇందులో బాలాసనం చాలా ముఖ్యమైనది.

.
.

బాలాసనం..

తుంటి, తొడ, మోకాళ్లు, చీలమండల దగ్గర ఉండే కండరాలను బలపరిచి రక్త ప్రసరణను పెంచడానికి బాలాసనం ఎంతో ఉపయోగ పడుతుంది. ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతకు దోహదపడుతుంది. అంతేకాకుండా బాలాసనం సాధన చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వెంట్రుకల కుదుళ్లు బలంగా తయారవుతాయి.

.
.
.
.
Yoga
బాలాసనం

ఇదీ చదవండి: ఎంబీబీఎస్ విద్యార్థులు 'యోగా' చేయాల్సిందే.. రోజూ గంటపాటు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.