How to Reduce Period Pain Dos and Don'ts : పీరియడ్స్ సమయంలో చాలా మంది మహిళలు పొత్తి కడుపు, నడుము నొప్పితో బాధపడతారు. కొందరిలో ఈ నొప్పి భరించలేకుండా ఉంటుంది. కడుపు ఉబ్బరం, వికారం, మూడ్ స్వింగ్స్ ఛేంజ్ అవ్వడం లాంటి పలు సమస్యలు కూడా వేధిస్తుంటాయి. దీంతో.. ఈ పీరియడ్స్ నొప్పి (Periods Pain) భరించలేక పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. అయితే.. వీటిని వాడేటప్పుడు కొందరు తెలియక చేసే పొరపాట్లు తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి.. నెలసరి సమయంలో పెయిన్ కిల్లర్స్ తప్పక వాడాల్సిన పరిస్థితి వస్తే.. కొన్ని చేయాల్సినని, చేయకూడని పనులు ఉన్నాయని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Periods Menstrual Cramps Causes : బహిష్టు సమయంలో మహిళల శరీరంలో ప్రొస్టాగ్లాడిన్స్ అనే పదార్థాలు విడుదలవుతాయి. ఇవి గర్భాశయంపై ఒత్తిడి చేస్తూ.. బ్లీడింగ్ రూపంలో రక్తాన్ని బయటికి పంపిస్తాయి. ఈ క్రమంలోనే పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. నడుం నొప్పి, ఇతర శారీరక నొప్పులకూ ఈ ప్రక్రియ కారణమవుతుంది. అయితే.. చాలామంది మహిళల్లో ఈ నొప్పి మోస్తరుగా ఉంటుంది. కానీ.. కొందరిలో నొప్పి తీవ్రత ఎక్కువగా ఉందంటే ప్రొస్టాగ్లాడిన్స్ ఎక్కువగా ఉత్పత్తైనట్లుగా అర్థం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఈ సమయంలో వచ్చే నొప్పి నుంచి ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్స్ వాడితే.. కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉందని చెబుతున్నారు.
పెయిన్ కిల్లర్స్ వాడితే..
- భరించలేని నొప్పి వస్తే ముందుగా మీరు చేయాల్సిన పని.. గైనకాలజిస్టును సంప్రదించడం.
- కొందరు డాక్టర్‌ను కలవాల్సినంత అవసరం లేదని భావించి.. పెయిన్ కిల్లర్ వేసుకొని గడిపేస్తారు. అయితే.. ఎలాంటి పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారనేది ముఖ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- పెయిన్ కిల్లర్స్ ఇష్టానుసారం వాడితే.. అవి నేరుగా కిడ్నీలపై దుష్ప్రభావం చూపుతాయి. కాబట్టి.. అవగాహనతోనే వాటిని తీసుకోవాలి.
- అదే సమయంలో డోస్ కూడా తప్పక పరిశీలించాలి. 200 mg, 250 mg దాటకుండా ఉండే వాటిని మాత్రమే ఎంచుకోవాలని సూచిస్తున్నారు.
- కొందరు నొప్పి ఎక్కువగా ఉందనే భావనతో.. కొద్ది గ్యాప్‌తోనే ఎక్కువ ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. అలా చేయకూడదని చెబుతున్నారు.
- ఎనిమిది గంటల వ్యవధిలో ఒకటి మాత్రమే వేసుకోవాలని.. భోజనం చేసిన తర్వాత మాత్రమే తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.
- వైద్యులు సూచించిన డోస్కన్నా ఎక్కువ తీసుకుంటే.. అనేక దుష్ప్రభావాలు ఎదురవుతాయనే విషయం మర్చిపోవద్దని హెచ్చరిస్తున్నారు.
- అన్నిటికన్నా ముఖ్యంగా సొంత వైద్యం చేసుకోవద్దని సూచిస్తున్నారు.
నెలసరి సమయంలో.. శృంగారంలో పాల్గొంటే గర్భం వస్తుందా?
నేచురల్ పరిష్కారాలు..
పెయిన్ కిల్లర్స్‌తో తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభిస్తుందని చెబుతున్న వైద్యులు.. సహజ పద్ధతుల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. దీనికి ఏం చేయాలంటే...
- హైడ్రేటెడ్‌గా ఉండాలి. అంటే.. శరీరానికి అవసరమైనంత నీరు తప్పక తాగాలి.
- అదనపు ఉబ్బరాన్ని నివారించాలి. అంటే.. సరిపడని ఆహారం తీసుకోవద్దు.
- యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉండే.. టమాటా, బెర్రీ, పైనాపిల్, అల్లం, ఆకుకూరలు, బాదం, వాల్‌నట్స్ వంటివి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
- విటమిన్ డి, ఇ, ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహార పదార్ధాలను తినాలి.
- పొత్తికడుపులో నొప్పి ఎక్కువగా ఉండే.. కాస్త దిగువ భాగంలో వేడి కలిగేలా చూసుకోండి.
- వ్యాయామం తప్పక చేయాలి. దీనిద్వారా.. శరీరంలో ఎండార్ఫిన్స్ విడుదలై.. కండరాలు ఫ్రీ అవుతాయి.
Fruits To Eat During Periods : నెలసరి సమయమా? ఈ పండ్లు తీసుకుంటే.. మీ హెల్త్‌కు డోకా ఉండదు!