ETV Bharat / sukhibhava

హెల్తీగా బరువు పెరగాలా? ఇలా చేయండి...! - బరువు పెరగడానికి చెప్పండి

Healthy weight gain tips: ఆరోగ్యకరంగా బరువు పెరగడం చాలా మందికి సవాల్. నోటికి రుచిగా అనిపించినవన్నీ తినేస్తే బరువు పెరుగుతారని అనుకుంటుంటారు. కానీ ఆరోగ్యానికి అది మంచిది కాదు. మరి ఆరోగ్యంగా బరువు పెరగడం ఎలా?

healthy weight gain tips
healthy weight gain tips
author img

By

Published : May 20, 2022, 7:53 AM IST

Weight gain foods: బరువు తగ్గాలని ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. వారిదో సమస్య అయితే.. బరువు పెరగాలనుకునే వారిది ఇంకో సమస్య. మరీ సన్నగా ఉన్నవారు.. ఆకర్షనీయంగా కనిపించట్లేదని ఆత్మన్యూనతకు గురవుతుంటారు. బరువు పెరిగేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే, ఏది పడితే అది తింటే లావు అయిపోతారని అనుకోవడం చాలా మందిలో ఉన్న అపోహ! అందుకే, పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్​ఫుడ్, సమోసాలు ఎక్కువగా లాగించేస్తుంటారు. వాటి ద్వారా శరీరంలో కొవ్వు పెరిగి.. లావెక్కుతామని భావిస్తుంటారు. అయితే, అది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.

జంక్ ఫుడ్ వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల.. గుండె జబ్బులు వంటివి తలెత్తుతాయని చెబుతున్నారు. అందుకే హెల్తీగా బరువు పెరగడం ఎలాగో సూచిస్తున్నారు.

"బరువు పెరగాలంటే.. శరీరానికి అవసరమయ్యే క్యాలరీల కన్నా.. 400 నుంచి 500 క్యాలరీలు ఎక్కువ తీసుకోవాలి. హెల్తీగా బరువు పెరగాలంటే వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. వ్యాయామం చేయడం వల్ల.. పెరిగే బరువు కేవలం కొవ్వు రూపంలో ఉండిపోకుండా.. కండగా మారేందుకు అవకాశం ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రతి మీల్​లో ప్రొటీన్ కంటెంట్ అధికంగా ఉండేలా చూసుకోవాలి. జంక్​ ఫుడ్ జోలికి వెళ్లొద్దు. చెడు కొలెస్ట్రాల్​కు దారితీసే ఆహార పదార్థాలకు బదులు.. మంచి కొవ్వు ఉండే నట్స్, సీడ్స్​ను ప్రతిరోజు ఓ గుప్పెడు తినాలి" అని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.