Child Hyperactivity Disorder : కొందరు పిల్లలు సైలెంట్‌గా ఉంటే.. మరికొందరు బాగా యాక్టివ్‌గా ఉంటారు. ఇలాంటి వారు ఉన్నచోట కుదురుగా ఉండక ఏదో ఒక పని చేస్తూ బాగా అల్లరి చేస్తుంటారు. పిల్లల అతి అల్లరికి ఏడీహెచ్‌డీ అనే వ్యాధి కారణం. దీనికి కచ్చితమైన కారణం లేకపోయినా.. అనేక అంశాలు ప్రభావితం చేస్తాయని చెప్పవచ్చు. జన్యువుల ప్రభావం, మెదడులో రసాయనాలు అదుపు తప్పడం, గర్భిణులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం, సీసం లాంటివి మెదడును ప్రభావితం చేయడం, మెదడుకు దెబ్బ తగలడం లాంటి వాటి వల్ల పిల్లలకు ఈ వ్యాధి వస్తున్నట్లు సైకియాట్రిస్ట్‌లు చెబుతున్నారు.
ADHD Symptoms In Children : ఏడీహెచ్‌డీ అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. పిల్లల్లో ఏడీహెచ్‌డీ లక్షణాలను 3 రకాలుగా వర్గీకరించారు. 1. దేన్నీ సరిగా పట్టించుకోరు. 2. కదలకుండా కూర్చుని చేసే పనుల్ని ఇష్టపడకపోవడం. తరచూ వస్తువులు పోగొట్టుకోవడం, పగటి కలలు కంటూ ఉండటం ఇందులోకి వస్తాయి. 3. అతి చురుకుదనం. కదలకుండా ఒకే దగ్గర కూర్చోలేకపోవడం, నిశ్శబ్దంగా ఉండలేకపోవడం, ఎప్పుడూ పరుగు తీయడం, ఇతరులు మాట్లాడుతుంటే అడ్డుపడటం లాంటివి చేస్తారు. ఈ లక్షణాల్ని బట్టి ప్రాథమికంగా ఒక అంచనాకు రావచ్చు.
Child Hyperactivity Treatment : పిల్లల్లో ఏడీహెచ్‌డీని నిర్ధరించడం చాలా కష్టం. ఏ ఒక్క పరీక్షతోనూ గుర్తించడం కుదిరే పని కాదు. పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్లతో సుదీర్ఘంగా ఆ లక్షణాలను చర్చించిన తర్వాత వారి ప్రవర్తనను పరిశీలించిన అనంతరం వైద్యులు ఒక అంచనాకు వస్తారు. ఏ లక్షణాలు ఎంత కాలం నుంచి ఉన్నాయనేది కూడా ముఖ్యమే. పిల్లల మానసిక స్థితిని పరిశీలించడానికి పలు పరీక్షలు చేస్తారు. పిల్లలతోపాటు వారి కుటుంబ సాంఘిక, వైద్య చరిత్ర తెలుసుకుంటారు.
ఏడీహెచ్‌డీ అనేది మెదడులోని నరాలకు సంబంధించిన వ్యాధి. ఇది కొందరిలో పుట్టుకతోనే వస్తుంది. పిల్లల పెరుగుదలను బట్టి.. ఆయా సమయాల్లో వ్యాధి బయటపడుతుంది. న్యూరో సైకియాట్రిక్ అంచనా వ్యవస్థ ఆధారంగా మెదడు తరంగాలను లెక్కకడతారు. ఈ తరంగాల నిష్పత్తి సాయంతో వ్యాధి ఉందా లేదా అని నిర్ధరిస్తారు. ఇది పూర్తిగా తగ్గే అవకాశాలు తక్కువనే చెప్పాలి. పరిశోధనలో తేలింది ఏంటంటే.. అనేక విధాలుగా లక్షణాల తీవ్రతను తగ్గించడమే మేలు. లక్షణాల్లో చాలా వరకు మందుల ద్వారా, థెరపీ ద్వారా తగ్గే అవకాశాలున్నాయి. కొందరు మందులను ఉత్ప్రేరకాలుగా వాడతారనే వివాదాలున్నాయి. అవసరానికి మించి వాడకంపైనా విమర్శలున్నాయి. పిల్లల అతి చురుకుదనానికి అడ్డుకట్ట వేయడం సహా ఏకాగ్రత సమయాన్ని పెంచడానికి ఈ మందులు పనికొస్తాయి. అందరికీ ఇవి పనిచేయకపోవచ్చు. ఆరేళ్లు పైబడిన వారికి యాంటీ డిప్రసెంట్ మందులు ఇస్తారు.
మందుల వల్ల కొన్ని సైడ్ ఎఫెక్టులు కూడా ఉంటాయి. ఆకలి తగ్గిపోతుంది. ప్రవర్తనలో దూకుడు తగ్గుతుంది, నిద్ర రాకపోవడం, చర్మం మీద మచ్చలు రావడానికి అవకాశముంది. ప్రవర్తనలో మార్పుల కోసం కొన్ని రకాల థెరపీలు చేస్తారు. కౌన్సెలింగ్ ద్వారా అవగాహన కలిగిస్తారు. అయిదేళ్లలోపు పిల్లలకు మందులు కాకుండా.. బిహేవియరల్ థెరపీ చేస్తారు. హైపర్ యాక్టివిటీని కంట్రోల్ చేసుకోవాలో చెప్పడంతో పాటు తల్లిదండ్రులకు కూడా తెలియజేస్తారు. అయిదేళ్లు దాటిన వాళ్లకు మందులు ఇస్తారు. ఇప్పడు అందుబాటులో ఉన్న అత్యాధునిక మందుల వల్ల ఫలితం తొందరగానే వస్తుంది.
Cardamom For Weight Loss : అధిక బరువు, జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా?.. యాలకులతో చెక్!
Milk Before Bed Is Good Or Bad : నిద్రపోయే ముందు పాలు తాగుతున్నారా? ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?