ETV Bharat / sukhibhava

వ్యాక్సిన్​ వేసుకున్న, వేసుకోని వారిలో కరోనా లక్షణాలు ఇవే..!

టీకా తీసుకున్నా, తీసుకోకపోయినా కరోనా సోకుతోంది. కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ రెండు సందర్భాల్లో లక్షణాలు వేరువేరుగా ఉంటున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

corona
కరోనా
author img

By

Published : Aug 9, 2021, 12:30 PM IST

Updated : Aug 9, 2021, 1:01 PM IST

కరోనా వైరస్​ ప్రపంచ దేశాలను మళ్లీ ముప్పుతిప్పలు పెడుతోంది. తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా డెల్టా వేరియంట్​(delta variant covid).. అనేక ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరుగుదలకు కారణమవుతోంది. టీకా పొందిన వారిలోనూ వైరస్​ లక్షణాలు బయటపడటం ఆందోళనకరంగా మారింది. అయితే టీకా తీసుకోవడమే మేలు అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వ్యాక్సిన్​ వల్ల వైరస్​ సోకినా.. తీవ్రత తక్కువ ఉంటుందని వారు చెబుతున్నారు.

ఈ క్రమంలో వ్యాక్సిన్​ తీసుకున్న వారిలో, వ్యాక్సినేషన్​ పాక్షికంగా అయిన వారిలో, అసలు టీకా తీసుకోని వారిలో వైరస్​ లక్షణాలు, తీవ్రత ఎలా ఉందనే అంశంపై అమెరికా సీడీసీ(రోగ నిరోధన నివారణ కేంద్రం) వివిధ కేసులపై పరిశోధనలు చేసి వివరణ ఇచ్చింది.

most common covid 19 symptoms
కరోనా ప్రధాన లక్షణాలు

టీకాతో రక్ష..

ఫైజర్​ టీకా తీసుకుంటే డెల్టా వేరియంట్​(delta variant covid vaccine) ముప్పు 88శాతం తగ్గుతుందని ఇంగ్లాండ్​లో జరిగిన పరిశోధనల్లో తేలింది. డెల్టాలోని ఇతర రకాలు సోకకుండా ఈ టీకా 79శాతం అడ్డుకుంటుందని రుజువైంది. అలాగే మిగతా టీకాలు వైరస్​పై సమర్థవంతగా పని చేస్తున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

మొత్తం మీద టీకాల కారణంగా ఆస్పత్రుల్లో చేరే ప్రమాదం, మరణించే వారి సంఖ్య 25రెట్లు తగ్గిందని అమెరికా సీడీసీ పేర్కొంది. అయితే దీర్ఘకాల కొవిడ్​తో జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది.

అందువల్ల టీకాలు తీసుకున్న వారికి, తీసుకోని వారికి మధ్య వ్యాధి తీవ్రత చాలా కీలకంగా మారింది. టీకా పొందిన వారిలో లక్షణాలు, తీవ్రత తక్కువగా ఉండగా, అసలు ఒక్క డోసు వ్యాక్సిన్​ కూడా తీసుకోని వారిని వైరస్​ చాలా సార్లు ముప్పుతిప్పలు పెడుతోంది. పాక్షికంగా టీకా వేసుకున్నా వైరస్​ సోకే అవకాశాలు ఎక్కువేనని పరిశోధకులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:- టీకా తీసుకున్న వారికీ కరోనా.. 'దీర్ఘకాల కొవిడ్​' తప్పదా?

Last Updated : Aug 9, 2021, 1:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.