ETV Bharat / sukhibhava

Cardamom For Weight Loss : అధిక బరువు, జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా?.. యాలకులతో చెక్​!

Cardamom For Weight Loss : బరువు తగ్గడానికి చాలా మంది విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. అందుకోసం తిండి మానేయడం, డైట్​ మెయింటేన్ చేయడం, భారీ వ్యాయామాలు చేయడం ఇలా అనేక రకాలుగా ప్రయత్నించి కొన్నిసార్లు విఫలమవుతుంటారు. అయితే మన వంటింట్లో ఉండే సుగంధ ద్రవ్యాల్లోని ఒకటైన యాలకులతో కూడా ఈజీగా బరువు తగ్గొచ్చనే విషయం మీకు తెలుసా?

Cardamom For Weight Loss Full Details Here In Telugu
Cardamom For Weight Loss
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 17, 2023, 7:31 AM IST

Cardamom For Weight Loss : యాలకులు మీ వంటకాలకు రుచులను అందించే సుగంధ ద్రవ్యమే కాదు.. మీ శరీర బరువును తగ్గించే ఓ సంజీవనిలా కూడా పనిచేస్తుంది. ఇవి శరీరంలోని అధిక కొవ్వు, కొలెస్ట్రాల్​ను తగ్గించే అద్భుతమైన లక్షణాలను కలిగి ఉంటాయి. యాలకులను రోజూ తినడం ద్వారా త్వరగా, సులువుగా బరువు తగ్గవచ్చు. ఇందులో పోషకాలు అధికంగా, కేలరీలు తక్కువగా ఉంటాయి.

ఓ అంతర్జాతీయ జర్నల్​ ప్రచురించిన పరిశోధన ప్రకారం.. యాలకుల్లో విటమిన్స్​, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్‌లు లాంటి యాంటీ ఆక్సిడెంట్​లు ఈ మసాలా దినుసులో సమృద్ధిగా ఉంటాయి. ఇవి మీ శరీరంలోని అధిక కొవ్వును కరిగించి బరువు తగ్గడంలో సాయపడతాయి. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న యాలకులను రోజూ తినడం ద్వారా మన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? అవి ఏ విధంగా శరీర బరువును నియంత్రణలో ఉంచుతాయో ఇప్పుడు చూద్దాం.

జీవక్రియను మెరుగుపరుస్తుంది..
యాలకులు శరీరంలోని జీవక్రియను మెరుగుపరుస్తాయి. మీ శరీరంలో పేరుకున్న అధిక కొవ్వును యాలకులు సులువుగా కరిగించి.. బరువు తగ్గడంలో సహాయపడుతాయి.

పొట్టను నిండుగా ఉంచుతుంది..
మసాలా దినుసుల్లో యాలకులకు ప్రముఖ స్థానం ఉంటుంది. సాధారణంగా వీటిలో ఆకలిని అణిచివేసే గుణం అధికంగా ఉంటుంది. దీంతో మీరు అధికంగా తినడం లేదా చిరుతిండ్లు తినడం తగ్గిస్తారు. ముఖ్యంగా అనారోగ్యాన్ని తెచ్చిపెట్టే జంక్​ ఫుడ్స్​ తినడం ద్వారా శరీర బరువు పెరుగుతుంది. అయితే వీటికి దూరంగా ఉండేందుకు యాలకులు తోడ్పడతాయి. తద్వారా మీరు సులువుగా బరువు తగ్గవచ్చు.

అధిక నీటిని బయటకు పంపుతుంది..
యాలకులు శరీరంలోని నీటి నిలుపుదల శాతాన్ని తగ్గిస్తుంది. తరచూ వీటిని తినడం వల్ల సహజమైన మూత్రవిసర్జన జరుగుతుంది. ఇవి శరీరంలో ఉండే అధిక నీటి శాతాన్ని తొలగించి ఉబ్బరం నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

జీర్ణశక్తిని పెంచుతుంది..
యాలకుల్లో ఉండే పోషకాహార శోషణ మీ జీర్ణక్రియను పెంచుతుంది. దీంతో మీరు తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. మొత్తంగా మీ జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరిచి వేగంగా పనిచేసేందుకు యాలకులు ఎంతో ఉపయోగపడతాయి. అలాగే గ్యాస్​, మలబద్ధకం లాంటి సమస్యల నుంచి కూడా ఈ సుగంధ ద్రవ్యం ఉపశమనం కల్పిస్తుంది.

మలినాలను బయటకు పంపుతుంది..
యాలకుల్లో ఉండే డీటాక్సిఫికేషన్​ గుణం మీ శరీరంలో ఉండే మలినాలను బయటకు పంపేందుకు సహాయపడతాయి. ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని విషపూరిత టాక్సిన్​లను యాలకులు సహజంగా విడుదల చేస్తాయి. తద్వారా మీ కాలేయ పనితీరు మెరుగుపడటమే కాకుండా మీ జీవక్రియ సక్రమంగా పనిచేస్తుంది. అలాగే మీ శరీర బరువుకు కారణమయ్యే ఇతర అవయవాల పనితీరును కూడా యాలకులు మెరుగుపరుస్తాయి. ఫలితంగా శరీరంలోని అధిక కొవ్వు తగ్గి మీరు త్వరగా బరువు తగ్గవచ్చు.

నోట్​ : ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారంతో పాటు తరచూ చేసే వ్యాయామాలను కూడా వీటితో పాటు చేర్చుకుంటే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.

Sex During Pregnancy : గర్భంతో ఉన్నప్పుడు సెక్స్​ చేయవచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారు?

Can Too Much Tea Cause Diabetes : రోజుకు 'టీ' ఎన్నిసార్లు తాగొచ్చు?.. ఎక్కువగా తాగితే డయాబెటిస్​​ వస్తుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.