ETV Bharat / sukhibhava

వంటల్లో నూనెకు బదులు నెయ్యి వాడవచ్చా?... కొవ్వు పెరిగి లావైపోతామా? - ghee for beauty

నెయ్యి అంటేనే మనకు గుర్తుకు వచ్చేది పండగ సమయాలలో చేసే స్వీట్లు.. ఆవకాయతో తినే వేడి అన్నం.. వీటి రుచి ఫైవ్​ స్టార్ హోటల్​లో కొన్ని వేలు ఖర్చుపెట్టి తిన్న పదార్థాలకి కూడా ఉండదు. ఏ వంటకానికి అయినా నెయ్యి జోడించారంటే దాని రుచి అమాంతం పెరిగిపోతుంది. కానీ నెయ్యి అంటే కొవ్వు మాత్రమే అనే అపోహ కొందరిలో ఉంటుంది. నెయ్యిలో రుచితో పాటు ఎ, ఇ, డి, కె..వంటి విటమిన్లు, ఒమేగా ఆమ్లాలు, అందాన్ని పెంచే బ్యుటిరిక్ ఆమ్లాలు లాంటి పోషకాలెన్నో ఉంటాయి. మరి ఇన్ని పోషక విలువలున్న నెయ్యితో ప్రతిరోజు వంట చేసుకోవచ్చా అనే సందేహం కూడా కలుగుతుంది. మరి చేసుకోవచ్చో లేదో అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Can We Replace Oil With Ghee
నెయ్యి
author img

By

Published : Jan 2, 2023, 7:53 AM IST

వంటల్లో నూనెకు బదులు నెయ్యి వాడవచ్చా?

మనం ప్రతిరోజూ వంటల్లో నూనెను ఉపయోగిస్తుంటాం. దానిస్థానంలో నెయ్యిని ఉపయోగిస్తే వంటలకు రుచి పెరుగుతుందని అనుకుంటారు. కానీ వంటల్లో నెయ్యిని వాడవచ్చో లేదో? ఒకవేళ నెయ్యితో చేసిన వంటలు తింటే కొవ్వు పెరిగి లావైపోతుంటావేమో? ఆరోగ్య సమస్యలు వస్తాయేమో? అనుకుంటాం. కానీ మితంగా ఉపయోగిస్తే ఎలాంటి సమస్యలుండవు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అతి చేసి శ్రుతి మించితే ఏదైనా అనారోగ్యమే. అందుకే ఒక వ్యక్తికి రెండు స్పూన్ల చొప్పున నెయ్యిని వాడుకుంటే ఎలాంటి సమస్యలుండవు. కానీ ఏదైనా వంటకాన్ని ఫ్రై చేయాలంటే మోతాదుకు మించిన నెయ్యి అవసరం అవుతుంది. కాబట్టి నెయ్యితో ఫ్రై వంటకాలు కాకుండా సాధారణ వంటకాలు చేసుకుంటే రుచితో పాటు ఆరోగ్యం వస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఏయే పోషకాలుంటాయి?
నెయ్యి వివిధ రకాల పోషకాల సమ్మేళనం. ఇందులోని ఎ, ఇ, డి, కె.. వంటి కొవ్వుల్ని కరిగించుకునే విటమిన్లు, ఒమేగా-3, ఒమేగా-6 వంటి ఫ్యాటీ ఆమ్లాలు, లినోలిక్, బ్యుటిరిక్ ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు.. మొదలైన పోషకాలన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. అందుకే పూర్వకాలం నుంచి నెయ్యిని పలు రకాల ఆహార పదార్థాల తయారీలోనే కాకుండా ఆయుర్వేద మందుల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు.

మెదడు చురుగ్గా..
శరీరంలో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ ఆమ్లాల స్థాయులు తగ్గిపోవడం వల్ల డిమెన్షియా, అల్జీమర్స్.. వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి వీటి బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవాలంటే.. ఈ రెండు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాంటివాటిలో అతి ముఖ్యమైంది నెయ్యి. ఇందులో ఎక్కువ మొత్తంలో ఉండే ఈ ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలోని నరాల పనితీరును మెరుగుపరిచి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి. తద్వారా మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది. కాబట్టి నెయ్యిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో అవసరం.

సులభంగా జీర్ణమవడానికి..
నెయ్యి ఎక్కువగా తీసుకోకండర్రా.. అరగదు..' అనే మాట మనం చాలా సార్లు వింటుంటాం. నిజానికి నెయ్యి తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడి తీసుకున్న ఆహారం మరింత సులభంగా అరుగుతుందంటున్నారు నిపుణులు. అదెలాగంటే.. నెయ్యి జీర్ణవ్యవస్థలో కొన్ని రకాల ఆమ్లాలు విడుదలయ్యేలా చేసి ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు దోహదం చేస్తుంది. కాబట్టి నెయ్యి తింటే అరగదు అన్న అపోహను తొలగించుకొని దీన్ని రోజూ ఆహారంతో పాటుగా తీసుకుంటే మరీ మంచిది.

గుండెకు మేలు..
చాలామంది నెయ్యిని ప్రాసెస్డ్ ఫుడ్‌గా భావిస్తారు. అందుకే దీన్ని తీసుకోవడం వల్ల గుండెపోటు, ఇతర హృదయ సంబంధిత సమస్యలు వస్తాయేమోనని భయపడుతుంటారు. కానీ నెయ్యిని రోజూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు నిపుణులు. ఇందులో అధిక మొత్తంలో ఉండే కాంజ్యుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్ఏ).. అనే ఫ్యాటీ ఆమ్లం క్యాన్సర్ కారకాలైన కార్సినోజెన్లను తగ్గిస్తుంది. అలాగే ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా కూడా రక్షిస్తుంది. తద్వారా గుండె సురక్షితంగా ఉంటుంది. అంతేకాకుండా.. సీఎల్ఏ అధిక బరువును తగ్గించడంతో పాటు బరువు పెరగకుండా కూడా కాపాడుతుంది. మీకు మరో విషయం తెలుసా..? నెయ్యిని ఆరు నెలల పాటు తక్కువ మోతాదులో రోజూ తీసుకోవడం వల్ల బరువు అదుపులోకి వస్తుందని ఓ అధ్యయనంలో కూడా వెల్లడైంది. కాబట్టి కనీసం ఇప్పటి నుంచైనా నెయ్యిని మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి మరి.

పెదాలు మృదువుగా..
నెయ్యి కేవలం ఆరోగ్యానికే కాదు.. అందానికీ మేలు చేస్తుంది. ఇది సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. చలికాలంలో చాలామందికి పెదాలు పగిలి.. కొన్ని సందర్భాల్లో రక్తం కూడా వస్తుంటుంది. కాబట్టి ఇలాంటి వారు రాత్రి పడుకొనే ముందు కాస్త నెయ్యిని తీసుకొని దాంతో పెదాలపై కాసేపు నెమ్మదిగా మర్దన చేసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల వాతావరణం ఎంత చల్లగా ఉన్నా.. పెదాలు మాత్రం మృదువుగా మెరుస్తూ ఉంటాయి.

ఉపయోగాలు:

  • నెయ్యి వల్ల శరీరంలో అనవసర కొవ్వులు పేరుకుపోతాయని చాలామంది భావిస్తుంటారు. కానీ నిజానికి ఇది రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వులను కరిగించడంలో మరింత చురుగ్గా పనిచేస్తుంది. ఇందుకు నెయ్యిలో ఉండే అత్యవసర అమైనో ఆమ్లాలే కారణం.
  • నెయ్యిలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీరాడికల్ డ్యామేజ్‌ని తగ్గించి క్యాన్సర్ రాకుండా కాపాడతాయి.
  • అలాగే ఈ పదార్థంలో ఉండే యాంటీవైరల్, యాంటీఫంగల్ గుణాలు రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంతేకాదు.. కీళ్ల నొప్పులతో బాధపడే వారికి కూడా నెయ్యి దివ్యౌషధం అనే చెప్పచ్చు.
  • శరీరానికి తక్షణ శక్తిని అందించడానికైనా, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికైనా, చర్మంపై ఏర్పడే అలర్జీలను తగ్గించడానికైనా నెయ్యి బాగా ఉపయోగపడుతుంది. ఇలా పలు రకాల ప్రయోజనాలు ఇందులో ఇమిడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.

ఎంత తీసుకోవాలి?
నెయ్యి ఆరోగ్యానికి మంచిదన్నారు కదా.. అని మరీ ఎక్కువగా తీసుకుంటే లేనిపోని అనారోగ్యాల్ని కొనితెచ్చుకున్నవారవుతారు. కాబట్టి రోజుకు రెండు టీస్పూన్ల నెయ్యిని తీసుకుంటే అటు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండడంతోపాటు ఇటు దాని నుంచి అన్ని రకాల ప్రయోజనాల్నీ పొందచ్చు. అలాగే గుండె జబ్బులు, మధుమేహం, స్థూలకాయం.. వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు.. వారి సమస్య స్థాయిని బట్టి నెయ్యి వినియోగాన్ని తగ్గించడం లేదంటే డాక్టర్ సలహా మేరకు ఉపయోగించడం మంచిది. మరి మీరు కూడా ఈ విషయాల్ని దృష్టిలో ఉంచుకోవడం చాలా అవసరం.

వంటకాలకు అమోఘమైన రుచిని అందించే నెయ్యి వల్ల ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకున్నారు కదా! మరి దీనివల్ల లేనిపోని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయేమోనన్న భయం నుంచి బయటపడి.. మీరు కూడా ఈ రోజు నుంచి నెయ్యిని ఆహారంలో భాగం చేసుకుంటారు కదూ!! అయితే ఒక్క విషయం.. మిగతా అన్నిటి మాదిరిగానే ఈ రోజుల్లో నెయ్యి కూడా కల్తీ అవుతోంది. ఏది అసలైనదో, నకిలీదో గుర్తించలేకపోతే ఆరోగ్యానికి మంచికన్నా హాని జరిగే అవకాశాలే ఎక్కువ. అందుకే ఈ విషయంలో సంబంధిత నిపుణులను సంప్రదించి వారు సిఫార్సు చేసిన ఉత్పత్తులనే వినియోగించడం శ్రేయస్కరం!

ఇవీ చదవండి:

త'స్మార్ట్' జాగ్రత్త.. 2022 నేర్పిన ఆరోగ్య పాఠాలెన్నో..

ఈజీగా బరువు తగ్గాలా? ఇంటర్మిటెంట్​ ఫాస్టింగ్​ ట్రై చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.