Best Home Remedies To Lose Weight Fast : నేటితరాన్ని ఆరోగ్య పరంగా వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో అధిక బరువు ఒకటి. ఈ ప్రాబ్లం నుంచి బయటపడేందుకు.. జనాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. వ్యాయామం, డైట్ అంటూ మొదలు పెడతారు. కానీ.. కొన్ని రోజుల తర్వాత వదిలేస్తారు. దీంతో.. సమస్య మళ్లీ మొదటికి వస్తుంది. ఇలాంటి వారికి ఆరోగ్య నిపుణులు పలు ఓ సలహా ఇస్తున్నారు. బరువు తగ్గడానికి ఇంతగా కుస్తీలు పట్టాల్సిన అవసరం లేదంటున్నారు. భోజనం చేసిన తర్వాత సరైన పద్ధతిలో నీటిని తాగడం ద్వారా.. ఎలాంటి వ్యాయామాలూ అవసరం లేకుండానే ఈజీగా బరువు తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గోరువెచ్చని నీటితో చెక్ : ఎక్కువ మంది తిన్న తర్వాత చల్లని నీరు తాగుతారు. కానీ.. అలా తాగకూడదట. అందుకు బదులుగా.. గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకుంటే మీ పొట్టను ఈజీగా తగ్గించుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
ఫ్రిజ్ నీటికి దూరంగా ఉండాలి : ఆయుర్వేదం ప్రకారం.. ఫ్రిజ్ నీరు తాగడం మంచిది కాదని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఫ్రిజ్ వాటర్ జీర్ణాశయంలోని అగ్నిని తగ్గిస్తుంది. ఫలితంగా ఆహారం తొందరగా జీర్ణమవ్వదు. దాంతో జీవక్రియ మందగిస్తుంది. బరువు పెరగడానికి తోడ్పడుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఫ్రిజ్ వాటర్‌కు దూరంగా ఉండాలంటున్నారు.
High Protein Diet Health Benefits : హై ప్రోటీన్ ఫుడ్‌తో.. స్థూలకాయం సహా.. బీపీ, షుగర్లకు చెక్!
వేడినీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..
జీవక్రియను పెంచుతుంది : చల్లని నీటికి బదులుగా గోరువెచ్చని నీరు తాగితే జీవక్రియ పెరుగుతుందట. కాబట్టి.. ప్రతిఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచాక వెంటనే గోరువెచ్చని నీరు తాగడం మంచిది. ఇలా.. అన్ని వేళలా గోరు వెచ్చని నీరు తాగడం ద్వారా తీసుకునే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఇది జీవక్రియను పెంచి బరువు తగ్గించడంలో చాలా హెల్ప్ చేస్తుంది.
కొవ్వు కరుగుతుంది : వేడినీరు తాగడం ద్వారా శరీరంలోని కొవ్వు కరిగి జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా, భోజనానికి ముందు వేడి నీటిని తాగితే మన కడుపు నిండుగా ఉంటుంది. దాంతో.. అధికంగా తినడం తగ్గుతుంది. ఫలితంగా.. శరీరంలోకి వెళ్లే కేలరీలు తగ్గడం ద్వారా బరువు కూడా తగ్గుతారని సూచిస్తున్నారు.
నిమ్మరసం కలిపిన వెచ్చని నీరు : మీరు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, కొద్దిగా తేనె కలిపి తాగితే ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అలా తాగడం ద్వారా మీ జీవక్రియ మరింత పెరుగుతుంది. ఫలితంగా మీరు ఈజీగా బరువు తగ్గుతారు. అలాగే.. జంక్ ఫుడ్ ఎక్కువగా తింటే కచ్చితంగా వేడి నీరు తాగాలి. ఇలా తాగడం ద్వారా శరీరం లోపలి నుంచి క్లీన్ అయి టాక్సిన్స్ తగ్గిపోతాయి. ఈ పనులు కంటిన్యూగా చేయడం ద్వారా.. మీ బెల్లి ఫ్యాట్‌ను ఈజీగా కరిగించుకోవచ్చని చెబుతున్నారు.
Eggs For Weight Loss : వేగంగా బరువు తగ్గాలా?.. కోడి గుడ్లను ఇలా తిని చూడండి!
Tips to Beat Menopause Belly in Telugu : నలభైల్లో పొట్ట పెరుగుతోందా.. ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే