Best Foods for Reduce Under Eye Dark Circles : కొందరి ముఖం జీవం కోల్పోయినట్టుగా కనిపిస్తుంది.. మరికొందరి ఫేస్ బాగానే ఉన్నా.. కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడుతుంటాయి. ఇవి అందాన్ని పాడుచేస్తున్నాయని జనం ఇబ్బంది పడతారు. మహిళల బాధ వర్ణనాతీతం. వీటిని తొలగించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తారు. అయినా.. ఫలితం సరిగా కనిపించదు. ఇలాంటి వారికి అద్బుతమైన డైట్ సూచిస్తున్నారు సౌందర్య నిపుణులు. మరి, అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సిట్రస్ జాతి పండ్లు తినాలి : చాలా మంది పని ఒత్తిడిలో పడి సరైన ఫుడ్ తీసుకోవడంపై అంతగా దృష్టిపెట్టరు. దీంతో కళ్ల కింద నల్లటి వలయాలు వస్తుంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడేవారు ఎక్కువగా విటమిన్ C ఉండే ఆహార పదార్థాలను తినాలి. ఎందుకంటే.. విటమిన్ సీ అనేది ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను రక్షించి నల్లటి మచ్చలు ఏర్పడకుండా కాపాడుతుంది. అందుకోసం.. మీరు రోజూ వారి ఆహారంలో నిమ్మ, ఉసిరి, క్యాప్సికం, కివీ, బెర్రీలు, జామకాయలు, కమలాలు లాంటివి ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా లైకోపీన్ అనేది కూడా మన చర్మాన్ని పిగ్మంటేషన్ నుంచి కాపాడుతుంది. టమోటాలు, క్యాప్సికం, క్యారెట్లు, జామ, పుచ్చకాయలు వంటి వాటిలో ఇది పుష్కలంగా ఉంటుంది.
ఆకు కూరలకు ప్రాధాన్యం ఇవ్వాలి : మన శరీరంలోని కణ జాలాలన్నింటికీ పుష్కలంగా ఆక్సిజన్ సరఫరా కావాలంటే.. అందుకు సరిపడినంత ఐరన్ కూడా బాడీలో ఉండాలి. బచ్చలికూర, పాలకూర, ఎండు ద్రాక్ష, గుమ్మడి గింజలు, పప్పు ధాన్యాలు, ఆకు కూరల్లో ఇది పుష్కలంగా లభిస్తుంది. వీటిలో ఏదో ఒకటి డైలీ డైట్లో ఉండేలా ప్లాన్ వేసుకోండి.
How To Look Young Forever : ఆరు పదుల వయసులోనూ యవ్వనంగా కనిపించాలా?.. ఈ 10 టిప్స్ పాటిస్తే చాలు!
విటమిన్ E తీసుకోవాలి : 'విటమిన్ E' ఉండే ఆహారపదార్థాలు కూడా కళ్ల కింద ఏర్పడిన నల్లటి మచ్చల్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పెద్ద మొత్తంలో ఉంటాయి. బాదాం, అవకాడో, పొద్దు తిరుగుడు గింజలు, వేరు శెనగ గింజలు, బంగాళ దుంప లాంటి వాటిని తినడం వల్ల మనకు విటమిన్ E సమృద్ధిగా లభిస్తుంది.
విటమిన్ K : పాడైపోయిన కణజాలాలను బాగు చేయడంలో K విటమిన్ ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. మీ రోజు వారీ ఆహారంలో క్యాబేజ్, ఆకు కూరలు, బ్రోకలీ, లెట్యుస్ లాంటి వాటిని భాగం చేసుకోవడం వల్ల మీ చర్మాన్ని కాపాడుకోవచ్చు. పైన పేర్కొన్న ఆహారాలను తీసుకుంటూ ఎప్పటికప్పుడు ముఖాన్ని మంచి క్లెన్సర్‌తో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలాగే ఎప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారాలను మాత్రమే తినే ప్రయత్నం చేయాలి.
ప్రశాంతమైన నిద్ర పోవాలి : ఒక్క ఆహార పదార్థాలు తీసుకోవడమే కాకుండా.. రోజుకు కనీసం మూడు లీటర్ల వరకు నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా సాయంత్రం 7 గంటల్లోపు రాత్రి భోజనాన్ని పూర్తి చేసేలా ప్లాన్ చేసుకోవాలి. వీటన్నింటితో పాటు ఎనిమిది గంటల ప్రశాంతమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఈ మార్పులు చేసుకోవడం ప్రారంభిస్తే.. కొద్దిరోజుల్లోనే మీ ఫేస్‌లో ఊహించని మార్పు గమనిస్తారు.
కళ్ల కింద డార్క్ సర్కిల్స్ వచ్చాయా?.. ఈ ఇంటి చిట్కాలు ట్రై చేస్తే చాలు!
Face Wash Tips in Telugu : మాటిమాటికీ ఫేస్‌వాష్ చేసుకుంటున్నారా.. అయితే మీరిది తెలుసుకోవాల్సిందే