ETV Bharat / sukhibhava

బెల్లం తింటే ప్రయోజనాలు బోలెడు! - జాగరీతో ఉపయోగాలు

తియ్య తియ్యటి అరిసెలు.. ప్రసాదంలా పెట్టే పరమాన్నం పండగనాడు తింటుంటే ఆహా అనకుండా ఉండలేం. అయితే వీటిలో వేసే బెల్లం వల్లే ఆ రుచి వస్తుంది. కేవలం రుచి మాత్రమే కాకుండా దీని నుంచి బోలెడు పోషకాలూ మనకు లభిస్తాయి. ఇది చాలా రకాలుగా మనకు మేలు చేస్తుంది. అవేంటో చూద్దామా..

eating jaggery
బెల్లం తింటే ప్రయోజనాలు బోలెడు!
author img

By

Published : Jan 15, 2021, 12:12 PM IST

పండగ ఏదైనా.. ప్రతి వంటింట్లో తప్పకుండా చేరే పదార్థం బెల్లం. పిండివంటలకు రుచిని తెచ్చే బెల్లానికి.. అనారోగ్యాలని దరిచేరకుండా చేసే శక్తీ ఉంది.

  • బెల్లం జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేసి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. అందుకే చాలా మంది భోజనం తర్వాత బెల్లం ముక్కను నోట్లో వేసుకుంటారు.
  • ఇది డిటాక్స్​లా పనిచేసి శరీరంలోని వ్యర్థాలు, విషాలను బయటకు పంపేస్తుంది. అంతేకాదు రోగనిరోధకతను పెంచి ఇన్​ఫెక్షన్స్​ రాకుండా చూస్తుంది.
  • మహిళలు రోజూ కొద్దిగా బెల్లం తినడం వల్ల నెలసరి ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • బెల్లం తిన్న వెంటనే శక్తి లభిస్తుంది. ఇది చాలా సేపటి వరకు అలాగే ఉంటుంది.
  • ఈ తీపి పదార్థంలో యాంటీ ఆక్సిడెంట్లు, జింక్​, సెలీనియమ్ లాంటి ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఇవి మనకు హాని చేసే ఫ్రీ రాడికల్స్​ను అడ్డుకుంటాయి.
  • దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
  • బెల్లంలో ఇనుము, ఫోలేట్​ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి దీన్ని తీసుకుంటే రక్తహీనత సమస్య దరిచేరదు. అనీమియాతో బాధపడే మహిళలు దీన్ని తమ ఆహారంలో చేర్చుకుంటే సరి. అలాగే గర్భిణులు కూడా.

ఇదీ చూడండి:బరువు తగ్గాలా? వ్యాయామం అప్పుడే చేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.