Bananas for Hair Growth : జుట్టు ఒత్తుగా.. నిండుగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. అందులోనూ.. మహిళల గురించి చెప్పాల్సిన పనిలేదు. వారికి జుట్టే ఆకర్షణీయం కాబట్టి.. దాని సంరక్షణ కోసం ఎన్నో తిప్పలు పడుతుంటారు. ప్రస్తుతం వింటర్ సీజన్ కాబట్టి.. ఈ సమయంలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా.. హెయిర్ ఫాల్(Hair Fall) సమస్య ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ సీజన్లో మీరు జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నట్టయితే.. ఈ హెయిర్ ప్యాక్ఓ సారి ట్రై చేయండి. ఈ సమస్య నుంచి ఈజీగా ఉపశమనం పొందుతారని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం పెద్దగా డబ్బు ఖర్చుచేయాల్సిన పని కూడా లేదు. మార్కెట్లో తక్కువ ధరకే దొరికే అరటిపండ్లతో వాటికి చెక్ పెట్టొచ్చు. అదెలా అని ఆలోచిస్తున్నారా? పూర్తి వివరాల కోసం ఈ స్టోరీ చదివేయండి.
How to Use Bananas for Hair Growth : అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలిసిన విషయమే. కానీ.. ఈ పండు జుట్టును మెరిపించి, మృదువుగా మారుస్తుందనే సంగతి చాలా మందికి తెలియదు. ప్రస్తుతం పొల్యూషన్ వల్ల ఎక్కువ మంది జుట్టు నిర్జీవంగా మారి ఊడిపోతోంది. జుట్టు రంగు, మెరుపు తగ్గిపోతాయి. అంతేకాదు.. మనం తినే ఆహారం వల్ల కూడా కురులు పటుత్వాన్ని కోల్పోాతాయి. ఇలాంటి సమస్యలన్నీ దూరమై.. మీ జుట్టు బలంగా నిగనిగలాడాలంటే అరటిపండు(Banana)తో చేసే హెయిర్ ప్యాక్ చాలా బాగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ దానిని ఎలా తయారుచేసుకోవాలి? ఎలా ఉపయోగించాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.
జుట్టు రాలిపోతుందా?.. కారణాలు ఇవే కావొచ్చు!.. వీటిని తింటే సెట్!!
- ముందుగా మీరు బాగా మగ్గిన అరటి పండ్లను తీసుకోవాలి. వాటిని ఒక బౌల్లో కట్ చేసుకొని బాగా మెత్తగా పేస్ట్‌లాగా చేసుకోవాలి.
- ఆ తర్వాత ఆ పేస్ట్‌ను మాడు నుంచి కురుల వరకూ పట్టించాలి. అలా కాసేపు ఉంచి ఆపై తలస్నానం చేయాలి.
- అరటి పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి అది మాడుపై రక్తప్రసరణను మెరుగుపరచడమే కాదు.. కుదుళ్లకు అవసరమైన పోషకాలను అందించటంలోనూ చాలా బాగా సాయపడుతుంది. అలాగే జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
- చాలా మందిలో చెమట, కాలుష్యం వంటి పలు కారణాల వల్ల చుండ్రు సమస్య తలెత్తుతుంది.
- దీంతో దురద, అలర్జీలే కాదు కొన్నిసార్లు కురుల ఎదుగుదలకూ ఆటంకం ఏర్పడుతుంది.
- అప్పుడు పెరుగులో అరటి పండు కలిపి, తలకు పట్టించండి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చుండ్రు, దాని వల్ల కలిగే దురదల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
- అరటి పండులోని విటమిన్లు, ఖనిజాలు జుట్టును ప్రకాశవంతంగా చేస్తాయి. సహజ కండిషనర్‌గా పనిచేసి, కురులను మృదువుగా మారుస్తాయి.
- అరటిలో సిలికా అనే పదార్థం జుట్టును మందంగా పెరిగేలా చేస్తుంది. దీనిలోని యాంటీ మైక్రోబియల్ లక్షణాలు మాడుకు తేమను అందిస్తాయి.
- అలర్జీ, పొట్టులా రాలడం వంటి సమస్యలను దూరం చేస్తాయి.
Hair Growth Tips : జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరగాలా? ఈ పనులు అస్సలు చేయకండి