Ayurveda Treatment For Kidneys: ప్రతి పదిమందిలో ఒకరు కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది 40 ఏళ్లలోపున్న వారే ఉన్నారు. మధుమేహం, అధిక రక్తపోటుతో కిడ్నీలు ప్రమాదంలో పడుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. రకరకాల సమస్యలు కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఆయుర్వేదంలో కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని మార్గాలను సూచించారు ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు మార్త భాస్కరరావు.
ఇవి ఎంతో కీలకం
కిడ్నీలు ప్రతి రోజు 200 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తాయి. నిరంతరం పని చేస్తూనే ఉంటాయి. ఇవి పాడయితే ఎన్నో సమస్యలు వచ్చి పడుతాయి. మనం తీసుకునే ఆహారం, మందులతో కొంత సమస్య వస్తుంది. దీన్ని తొందరగానే నివారించవచ్చు. క్రానిక్ కిడ్నీ డిజాస్టర్ వచ్చినపుడు చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. అదుపులేని మధుమేహం, అధిక రక్తపోటుతోనే కిడ్నీలు దెబ్బతింటాయి.
చికిత్స ఎలా చేస్తారంటే..
నిత్యం వ్యాయామం చేయడంతో పాటు ఉప్పును పూర్తిగా వదిలేయాలి. అధిక బరువును తగ్గించుకోవాలి. వరుణ, గోక్షుర, రక్తచందనం. తామర ఆకులతో చేసిన చూర్ణాలను తీసుకోవాలి. ఆయుర్వేద ఆహారం, మందులను వినియోగించాలి. వీటితో కిడ్నీల పనితీరును మెరుగు పర్చడానికి వీలవుతుంది.
ఇవీ చదవండి: ఒక్కసారిగా బరువు పెరుగుతున్నారా, కారణాలివే కావొచ్చు