Avoid These Mistakes While Sleeping to Stop Acne : అందంగా ఉండాలని కోరుకోని అమ్మాయి ఉండదు. అయితే అమ్మాయిలను ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య మొటిమలు. వీటి కారణంగా నొప్పి, వాపు కూడా బాధపెడుతూ ఉంటాయి. చాలా మంది బయటకు కూడా రాలేరు. అయితే పింపుల్స్ రావడానికి చాలా కారణాలు ఉన్నా.. నిద్రపోయేప్పుడు మనం చేసే పొరపాట్ల కారణంగా మొటిమలొచ్చే అవకాశాలు ఎక్కువంటున్నారు నిపుణులు. ఈ తప్పులు చేయకుండా ఉంటే మొటిమలు రాకుండా ఉంటాయంటున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం..
జుట్టుకు దట్టంగా నూనె: కొంతమంది ఉదయాన్నే తలస్నానం చేయచ్చన్న ఉద్దేశంతో.. రాత్రి పడుకునే ముందే జుట్టుకు నూనె పెడుతుంటారు. అయితే ఈ అలవాటు క్రమంగా మొటిమలకు దారితీస్తుందంటున్నారు నిపుణులు. అదెలాగంటే.. కుదుళ్లలోని జిడ్డుదనం పరోక్షంగా ముఖ చర్మంపై సీబమ్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇలా అవసరానికి మించి ఎక్కువ నూనెలు ఉత్పత్తవడం వల్ల ముఖంపై మొటిమలొస్తాయి. కాబట్టి పడుకునే ముందు ఈ అలవాటును మానుకోమంటున్నారు నిపుణులు. దీనికి ప్రత్యామ్నాయంగా.. తలస్నానం చేయడానికి రెండు గంటల ముందు జుట్టుకు నూనె పట్టించి.. ఆపై గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయడం మంచిదంటున్నారు. ఫలితంగా మొటిమల ముప్పూ తప్పుతుందంటున్నారు.
బీట్‌రూట్ ఇలా ఉపయోగిస్తే మొటిమలు, మచ్చలు దూరం!
వాటిని మార్చడం తప్పనిసరి: ఎప్పటికప్పుడు దిండు కవర్లను మార్చే విషయంలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. కానీ ఈ నిర్లక్ష్యమే మొటిమలు రావడానికి ప్రధాన కారణమవుతుందంటున్నారు నిపుణులు. సాధారణంగా మన చర్మం విడుదల చేసే నూనెలు, చెమట, బ్యాక్టీరియాతో పాటు మృతకణాలూ దిండు పైకి చేరతాయి. రోజూ ఈ ప్రక్రియ జరుగుతుంటుంది. ఇక ఇదే దిండును రోజుల తరబడి ఉపయోగించడం వల్ల అవి చర్మ రంధ్రాల్లోకి చేరి.. వాటిని మూసేస్తాయి. ఫలితంగా మొటిమలొస్తాయి. ఇలా జరగకుండా ఉండాలంటే.. వారానికి ఓసారి తప్పకుండా దిండు కవర్లను మార్చడం, దిండ్లను వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేయడం, సిల్క్ బెడ్‌షీట్లు, దిండు కవర్లను ఉపయోగించడం.. తప్పనిసరి! అలాగే ఒకరు ఉపయోగించిన దిండ్లు మరొకరు వాడకుండా జాగ్రత్త పడడమూ ముఖ్యమే అని.. ఫలితంగా మొటిమల సమస్యకు చాలావరకు దూరంగా ఉండచ్చంటున్నారు నిపుణులు.
చలికాలంలో కాళ్ల పగుళ్లు వేధిస్తున్నాయా? ఈ నేచురల్ ప్యాక్స్‌తో కోమలంగా మారిపోతాయి!
మేకప్ తొలగించుకోకపోయినా: నిద్రపోయే ముందు చర్మంపై ఎలాంటి మేకప్ ఉత్పత్తులు లేకుండా, క్రీమ్‌లు వాడకుండా ఉండడం మంచిదంటున్నారు నిపుణులు. కొంతమంది ఓపిక లేదనో, నిర్లక్ష్యంతోనో.. మేకప్ తొలగించకుండా లేదంటే పైపైన తొలగించుకొని నిద్రపోతారు. ఫలితంగా చర్మ రంధ్రాల్లో మేకప్ అవశేషాలు ఉండిపోయి.. మూసుకుపోతాయి. తద్వారా మొటిమలొస్తాయి. కాబట్టి ఈ సమస్య రాకుండా ఉండాలంటే.. మేకప్ పూర్తిగా తొలగించుకున్నాకే నిద్రపోవాలంటున్నారు నిపుణులు. అప్పుడే చర్మానికి రక్తప్రసరణ కూడా మెరుగై.. ముఖం కాంతివంతంగా మారుతుందంటున్నారు.
రాత్రి పూట హాయిగా నిద్ర పట్టాలా? ఈ ఆహారాలకు దూరంగా ఉండండి!
వాతావరణమూ ముఖ్యమే: కొంతమందికి బెడ్‌రూమ్‌లో వాతావరణం వెచ్చగా ఉంటే నిద్ర పడుతుంది.. మరికొందరు ఏ కాలమైనా ఏసీ వేసుకొని పడుకుంటారు. నిజానికి నిద్రించే సమయంలో పడకగది వాతావరణం కూడా మొటిమలకు కారణమవుతుందంటున్నారు నిపుణులు. గాల్లో తేమ ఎక్కువగా ఉండడం (హ్యుమిడిటీ), గదిలో ఉష్ణోగ్రత పెరిగిపోవడం వల్ల.. చర్మం ఎక్కువ సీబమ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా జిడ్డుదనం పెరిగిపోయి మొటిమలొస్తాయి. అదే చల్లటి వాతావరణం ఉంటే.. చర్మం పొడిబారిపోతుంది. ఫలితంగా చర్మాన్ని తేమగా మార్చుకోవడానికి ఎక్కువ క్రీమ్‌లు, మాయిశ్చరైజర్లు రాసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల కూడా చర్మం జిడ్డుగా మారి మొటిమల సమస్య వేధిస్తుంది. కాబట్టి పడకగదిలోని వాతావరణం మరీ వేడిగా, మరీ చల్లగా లేకుండా చూసుకోవాలి. అలాగే ఏసీలు, హ్యుమిడిఫైయర్ల వినియోగం ఎంత తగ్గిస్తే అంత మంచిదంటున్నారు నిపుణులు.
ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఈ ఆసనాలు వేస్తే - ఈజీగా నార్మల్ డెలివరీ!
యవ్వనంలో స్లిమ్‌గా ఉండి - ఆ తర్వాత బరువు పెరిగారా? అసలైన కారణమిదే!
ఈ ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేస్తే - పార్లర్‌కు వెళ్లకుండానే మెరిసే అందం మీ సొంతం!