ETV Bharat / sukhibhava

కునుకు మంచిదే.. కాస్త రిలాక్స్​ అయిపోండి!

author img

By

Published : Apr 24, 2020, 7:17 PM IST

Updated : May 21, 2020, 4:50 PM IST

నిద్ర అంటే నచ్చని వారే ఉండరు. కాసేపు కునుకు తీస్తే ఎంతో హాయిగా అనిపిస్తుంది. మరి ఆ నిద్ర విషయంలో కొన్ని చిట్కాలు పాటిస్తే మరెంతో హ్యాపీగా ఉండొచ్చు. అవేంటో చదివేయండి మరి!

sleep
నిద్ర

పగటిపూట కాసేపు కునుకు తీయటం మనలో చాలామందికి అలవాటే. ఇది పని అలసటను దూరం చేసి కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మెదడుకు చురుకుదనాన్ని తెచ్చిపెడుతుంది. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే దీంతో మరింత మేలు కలిగేలా చూసుకోవచ్చు.

  • ఎక్కువసేపు కునుకు తీయొద్దు. ముఖ్యంగా పనులు చేసే సమయంలో దీన్ని మరవొద్దు. ఎక్కువసేపు కునుకు తీస్తే చాలాసేపటి వరకు మగతగా అనిపిస్తుంది. ఇది చురుకుదనాన్ని తగ్గిస్తుంది. కాబట్టి పగటిపూట 10-20 నిమిషాల కన్నా ఎక్కువసేపు పడుకోవద్దు. సెలవురోజుల్లోనూ గంట కన్నా ఎక్కువసేపు కునుకు తీయొద్దు. ఇది రాత్రి నిద్రను దెబ్బతీస్తుంది.
  • చీకటి పడుతుండగా కునుకు తీయకపోవటమే మంచిది. రాత్రిపూట పడుకునే సమయానికి దగ్గర్లో కునుకు తీస్తే ఆనక నిద్ర పట్టకపోవచ్చు. నిజానికి కునుకు తీయటానికి సరైన సమయమంటూ ఏదీ లేదు గానీ.. మధ్యాహ్నం 1-4 గంటల మధ్య పడుకోవటం మేలు. సాధారణంగా ఈ సమయంలో మన జీవగడియారం నిద్ర వస్తున్న భావన కలగజేస్తుంటుంది.
  • నిద్రలేమి, నిద్ర మధ్యలో శ్వాసకు అడ్డంకి తలెత్తటం వంటి సమస్యలు గలవారు పగటిపూట నిద్రపోకపోవటం ఉత్తమం. పగటినిద్రతో వీరిలో సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశముంది.
  • కునుకు పట్టినపుడు కలలు కూడా వస్తుంటే.. రాత్రిపూట సరిగా నిద్రపోవటం లేదనే అర్థం. ఇలాంటివాళ్లు రాత్రిపూట తగినంత నిద్రపోయేలా చూసుకోవాలి. ఇక రాత్రిపూట తగినంత నిద్రపోయేవారికి పగటి నిద్ర అవసరమే రాదు.

ఇదీ చదవండి: కరోనాపై పోలీసుల ప్రాంక్​.. వీడియో వైరల్​

Last Updated : May 21, 2020, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.