ETV Bharat / sukhibhava

కరోనా వేళ.. తల్లిపాలు శ్రేయస్కరమేనా?

తల్లిపాలు బిడ్డకు ఎంతో బలం.. ఎన్నో రకాల పోషకాలు ఉండే ఆ పాలు చిన్నారి ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతాయి. అందుకే మొదటి ఆరు నెలలు తల్లిపాలు పట్టించడం ఎంతో కీలకమని అంటున్నారు నిపుణులు. తల్లికి ఎన్ని సమస్యలున్నా పాపాయికి పాలు పట్టొచ్చు అని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సమస్య. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో​ బిడ్డకు తల్లి పాలివ్వొచ్చా? ఒక వేళ తల్లికి వైరస్​ ఉంటే అది బిడ్డకు సోకుతుందా? గర్భిణులపై వైరస్​ ప్రభావం ఎలా ఉంటుంది? లాంటి విషయాలను ప్రముఖ గైనకాలజిస్ట్​ డాక్టర్​ నీరజ్​ బోర్కర్​ మాటల్లో..

is-it-safe-to-breastfeed-during-covid-19
కరోనా సమయంలో తల్లిపాలు మంచిదేనా!
author img

By

Published : Apr 26, 2020, 10:42 AM IST

Updated : May 21, 2020, 4:50 PM IST

"గర్భిణులపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఎంత మేరకు ఆ ప్రభావం ఉంటుందనే దానిపై ఎలాంటి ఆధారాలు లేవు. కానీ, కరోనా మహమ్మారి బారిన పడకుండా తమను, తమ బిడ్డను రక్షించుకునేందుకు గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తదితర సమస్యలను గుర్తించినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి" అని సూచిస్తున్నారు ప్రముఖ గైనకాలజిస్ట్​ డాక్టర్​ నీరజ్​ బోర్కర్​.

కరోనా సమయంలో గర్భిణులు, చిన్న పిల్లల తల్లులు, వారి కుటుంబ సభ్యులు ఎక్కువ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో డాక్డర్​ నీరజ్​ బోర్కర్ పలు సందేహాలను నివృత్తి చేశారు.

ప్ర. గర్భిణులపై కరోనా ప్రభావం ఎంత మేరకు ఉంటుంది?

జ. గర్భిణులపై కరోనా ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనే విషయంపై ఇప్పటికే పలు పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే వీరికి సాధారణ ప్రజలకంటే ఎక్కువ ప్రమాదం ఉన్నట్లు ఆధారాలు లేవు. కానీ, గర్భిణిగా ఉన్నప్పుడు వారి రోగ నిరోధక వ్యవస్థలో మార్పుల కారణంగా వారు కొన్ని రకాల శ్వాసకోశ ఇన్​ఫెక్షన్లకు లోనవుతారు. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకు జ్వరం, దగ్గు, శ్వాసకోశ ఇబ్బందులు ఎదురైతే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

ప్ర. గర్భంతో ఉన్నప్పుడు కరోనా బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

జ. కరోనా సమయంలో గర్భిణులు స్థానిక ఆరోగ్య అధికారులు సూచించే జాగ్రత్తలు తప్పక పాటించాలి.

  • ఆల్కాహాల్​తో తయారైన హ్యాండ్​ రబ్​ లేదా సబ్బుతో తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి
  • రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా, ఇతరులకు దూరంగా ఉండడం చాలా ఉత్తమం
  • కళ్లు, ముక్కు, నోటిని తాకకుండా ఉండాలి
  • నిత్యం పరిశుభ్రంగా ఉండాలి. తుమ్మినా, దగ్గినా మోచేయి అడ్డుపెట్టుకోవాలి. అలాంటి సందర్భాల్లో టిష్యూలను ఉపయోగించాలి. వాడిన తర్వాత వాటిని దూరంగా పారవేయాలి.

ప్ర. నవజాత శిశువుకు కరోనా సంక్రమిస్తుందా?

జ. గర్భిణికి కరోనా ఉన్నట్లయితే కడుపులో ఉన్నప్పుడు లేదా ప్రసవ సమయంలో బిడ్డకు వైరస్​ సంక్రమిస్తుందా అనే విషయమై ఇంకా స్పష్టత లేదు. అయితే.. ఇదే విషయమై ఉమ్మనీరు, తల్లిపాల నమూనాలను పరీక్షించినప్పుడు వాటిలో వైరస్​ లక్షణాలు కనిపించలేదు.

ప్ర. ఈ సమయంలో ప్రసవానికి ఏ పద్ధతి శ్రేయస్కరం?

జ. ప్రస్తుతం అందరూ సిజేరియన్ వైపే మొగ్గు చూపెడుతున్నారు. నార్మల్​ డెలివరీ అయితే తల్లి ప్రసవవేదన భరించాలని అందరూ ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. కానీ సిజేరియన్​ వల్ల ఆ తల్లి.. తర్వాతి కాలంలో ఎక్కువ ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. వైద్యులు సూచిస్తేనే సిజేరియన్​ చేయించుకోవాలి. లేదంటే నార్మల్​ డెలివరీకి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.

ప్ర. పాలు పట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

జ. తల్లిపాలు బిడ్డను అనేక అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి. శిశువుకు పోషకాలు లభించడానికి తల్లిపాలు ఉత్తమ వనరు. ఇప్పటివరకు తల్లిపాలలో కరోనా వైరస్​ను గుర్తించలేదు. అందువల్ల తల్లిపాల నుంచి వైరస్​ వ్యాప్తి చెందుతుందా లేదా అనే విషయం కచ్చితంగా తెలీదు.

  • తల్లి అనారోగ్యానికి గురైనట్లయితే మాస్క్​ ధరించడం, పాలిచ్చే ముందు చేతులు శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకొని పాలివ్వాలి.
  • నేరుగా పాలివ్వకుండా ఏదైనా ప్రత్యామ్నాయం ద్వారా అందించాలి. ఇందుకు ఉపయోగించే వస్తువులను శుభ్ర పరచడం మరచిపోవద్దు.

ఇదీ చదవండి: 'వేసవిలో భారత్​ కరోనాను జయించొచ్చు!'

Last Updated : May 21, 2020, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.