YS Viveka Murder Case transfer: వైఎస్ వివేకా హత్య కేసు పులివెందుల నుంచి కడప జిల్లా కోర్టుకు బదిలీ అయింది. ఈ మేరకు కేసు విచారణను పులివెందుల మెజిస్ట్రేట్ బదిలీ చేశారు. దీంతో ఇక నుంచి కడప జిల్లా కోర్టులోనే వివేకా హత్య కేసు విచారణ జరగనుంది. రిమాండ్, వాయిదా, బెయిల్ అంశాలు కడప కోర్టులోనేనని మెజిస్ట్రేట్ ఆదేశించారు. మరోవైపు పులివెందుల కోర్టుకు నలుగురు నిందితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ నలుగురికి సీబీఐ అభియోగ పత్రాల వివరాలు అందించారు.
నిందితుల రిమాండ్ పొడిగింపు..
అంతకుముందు ప్రధాన నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిలను సీబీఐ అధికారులు పులివెందుల మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కేసులోని ముగ్గురు నిందితుల రిమాండ్ గడవును న్యాయస్థానం.. 14 రోజుల పాటు పొడిగించింది. కడప జైలులోని సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డిలను కొంత ఆలస్యంగా కోర్టుకు తీసుకువచ్చారు. మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అనారోగ్య కారణాలతో కోర్టుకు హాజరుకాలేదు. శివశంకర్‌రెడ్డి ప్రస్తుతం కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి
రేపు నెల్లూరు జిల్లాకు సీఎం జగన్.. గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు హాజరు