మద్య నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో మహిళా సమాఖ్య మహిళలు ఆందోళన చేశారు. ఎన్నికల సందర్భంగా మద్య నిషేధం విధిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఏడాది గడిచినా వాగ్దానాన్ని అమలు చేయకుండా, మద్యం రేట్లు పెంచి పేదలపై భారం మోపారని మండల కమిటీ కన్వీనర్ మేరీ విమర్శించారు. కరోనా కారణంగా ఆరు నెలలుగా పనులు లేక పేద కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ.7500, ప్రతి మనిషికి 10 కిలోల బియ్యంతోపాటు 16 రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వాలని కోరారు.
ఇదీ చదవండి: