కడప జిల్లా గోపవరం మండలం ప్రాజెక్ట్ కాలనీ వద్ద రెండు లారీలు పరస్పరం ఢీకొన్నాయి. ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కావటంతో ఆసుపత్రికి తరలించారు. రెండు లారీలు రహదారిపై అడ్డంగా ఉండిపోవటంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాహన రాకపోకలను పునరుద్ధరించారు.
ఇదీ చదవండి: పోరుమామిళ్ల మండలంలో నాలుగు కరోనా కేసులు