SC ON GANGI REDDY BAIL PETITION : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై విచారణను సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ.... కేంద్ర దర్యాప్తు సంస్థ- సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సి.టి.రవికుమార్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. డీఫాల్ట్‌గా వచ్చిన బెయిల్‌ను రద్దు చేయలేమంటూ... ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పక్కనపెట్టిన ధర్మాసనం... బెయిల్ రద్దు పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టుకు 'రిమాండ్' చేస్తూ తుది ఉత్తర్వులు ఇచ్చింది. వివేకా హత్య కేసు దర్యాప్తును ఏపీ నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసినందున... గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ కూడా తెలంగాణ హైకోర్టే చేపట్టాలని తీర్పులో పేర్కొంది.
డీఫాల్ట్ బెయిల్ పొందిన వ్యక్తి బెయిల్ రద్దు చేయకూడదన్న నిషేధం ఎక్కడా లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేసులో బలమైన ఆధారాలు ఉన్నప్పుడు... దర్యాప్తు సంస్థ తగిన సమయంలో ఛార్జిషీటు దాఖలు చేయకపోవడం సరైన పద్దతి కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బెయిల్ మంజూరు చేసినప్పుడు.... కేసు మెరిట్స్ కంటే.. కాలపరిమితి నిబంధనలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారన్న సుప్రీంకోర్టు... కేసులోని మెరిట్స్ ఆధారంగా బెయిల్ అంశంపై మరోసారి విచారణ చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడింది.
నాన్ బెయిలబుల్ నేరానికి పాల్పడిన సందర్భంలో చార్జిషీటు దాఖలు చేయలేదన్న ఒకే ఒక్క కారణంతో కేసులోని మెరిట్స్‌ను పరిగణనలోకి తీసుకోకుండా డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయడం తగదని పేర్కొంది. అలాంటి సందర్భంలో.... బెయిల్ మంజూరుకు మెరిట్‌నే పరిగణించాల్సి ఉంటుందని... డిఫాల్ట్ బెయిల్ పొందిన వ్యక్తి విచారణకు సహకరించని పక్షంలో బెయిల్ రద్దు చేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. చట్టం ప్రకారం, మెరిట్ ఆధారంగా... బెయిల్ రద్దు విషయాన్ని తిరిగి పరిశీలించడానికి పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ తీర్పునిచ్చింది.
ఇవీ చదవండి: