ETV Bharat / state

నీతిక‌థ‌లు... ఆటపాటలు... వేసవి సెలవులు

విద్యార్థ‌ుల‌కు సెల‌వులొచ్చాయి. ఇన్నాళ్లు పాఠ‌్య పుస్తకాలు, ప‌రీక్ష‌ల‌తో ఒత్తిడికి గురైన చిన్నారులు... ప్రస్తుతం ఉల్లాసంగా... ఆట‌పాట‌ల‌తో ఆనందంగా గ‌డిపేస్తున్నారు. చాలామంది త‌ల్లిందండ్రులు త‌మ పిల్ల‌లు వేస‌వి సెల‌వుల్లో ప‌లు అంశాల్లో నైపుణ్యం పెంచుకునేలా చూస్తున్నారు. మ‌రికొంద‌రు చిన్నారులు క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులోని గ్రంథాల‌య సంస్థ ఆధ్వర్యంలో నిర్వ‌హిస్తున్న వేస‌వి శిక్ష‌ణా తరగతులకు వెళ్లి సెలవులను స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. చిత్ర‌లేఖ‌నం, జిరాఫీ చెస్, స్పోకెన్ ఇంగ్లీష్‌, క‌బడ్డీ, ఖోఖో, తెలుగు ప‌ద్యాలు, పాట‌లు ఆసక్తిగా నేర్చుకుంటున్నారు.

author img

By

Published : May 11, 2019, 9:03 AM IST

నీతిక‌థ‌లు... ఆటపాటలు... వేసవి సెలవులు
నీతిక‌థ‌లు... ఆటపాటలు... వేసవి సెలవులు

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో ఏప్రిల్ 24 నుంచి గ్రంథాల‌య సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు వేస‌వి తరగతులు నిర్వ‌హిస్తున్నారు. 3 గ్రంథాల‌యాల ప‌రిధిలో మొత్తం 45 వేల పుస్త‌కాలు అందుబాటులో ఉండగా... వాటిలో వెయ్యి పుస్త‌కాలు చిన్నారుల‌కు సంబంధించిన‌వే. ఏప్రిల్ 24 వరకు కేవలం పాఠ్య పుస్తకాలతో కుస్తీపట్టిన చిన్నారులు ఇప్పుడు... అవ‌స‌ర‌మైన నైపుణ్యాల‌ను పెంపొందించుకుంటున్నారు. వేస‌వి సెల‌వుల్లో స‌మ‌యాన్ని వృథా చేయ‌కుండా... కొత్త కొత్త నీతి పుస్తకాలు చదువుతున్నారు.

ఆసక్తి పెంచుతున్న జిరాఫీ చెస్...
ఈ వేస‌వి తరగతుల్లో చిన్నారులు చాలారకాల అంశాల‌పై ప‌ట్టు సాధిస్తున్నారు. నిర్వాహకులు ప్ర‌తిరోజూ గంట పాటు విద్యార్థులతో జిరాఫీ చెస్ ఆడిస్తున్నారు. చిన్నారులు కూడా దీనిపై రోజురోజుకూ ఆస‌క్తి చూపుతున్నారు. పోటీ ప‌డి ఈ ఆట‌ను నేర్చుకుంటున్నారు. స్పోకెన్ ఇంగ్లీష్‌, వ్యాయామం, నీతిక‌థ‌లు చెప్ప‌డంతోపాటు ప‌లు ర‌కాల పుస్త‌కాల‌ను చ‌దివించే విధంగా శ్ర‌ద్ధ తీసుకుంటున్నారు నిర్వాహకులు. వీటితోపాటు కబడ్డీ, ఖోఖో ఆడిస్తూ.. చిన్నారుల్లో ఉత్సాహం నింపుతున్నారు.

శ్రద్ధగా... క్రమశిక్షణతో...
విద్యార్థులకు తెలుగు భాష గొప్పతనాన్ని చెబుతూ... ప‌ద్యాలు నేర్పిస్తున్నారు. నీతి కథలు చెబుతున్నారు. అభిన‌య గేయాలపై ప‌ట్టు క‌ల్పిస్తున్నారు. ఇవే కాకుండా వచ్చే విద్యాసంవత్సరానికి అవసరమయ్యే విధంగా మెళ‌కువ‌లు నేర్పిస్తున్నారు. ఈ తరగతులు ఎంతో ఉప‌యోగప‌డుతున్నాయని చిన్నారులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఒత్తిడి లేకుండా ఆట‌పాట‌ల‌తో తరగతులు నిర్వహించడం అభినందనీయమని చిన్నారుల తల్లిదండ్రులు కొనియాడుతున్నారు. విద్యార్థులు శ్రద్ధగా, క్రమశిక్షణతో తరగతులకు హాజరై... నేర్చుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు.

ఇదీ చదవండి...

తాటి ముంజలు... అవనిగడ్డ టు హైదరాబాద్

Intro:ap_knl_31_10_accident_mruthi_av_c3 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని రాళ్లదొడ్డి గ్రామం వద్ద రెండు మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొని పరుశరాముడు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక్కగాని ఒక్క కుమారుడు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. సోమిరెడ్డి, రిపోర్టర్,ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా,8008573794.

Body:రోడ్డు ప్రమాదం

Conclusion:ఒకరి మృతి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.