ETV Bharat / state

గంజాయి క్వీన్ నీతూ కోసం తీవ్రంగా గాలింపు - ఫ్యామిలీ మొత్తం ఇదే దందా - GANJA QUEEN NEETU BAI FROM DHOOLPET

రోజూ కనీసం 2 నుంచి 4 లక్షల రూపాయల గంజాయి విక్రయాలు - ఎనిమిది సంవత్సరాలలో కోట్ల రూపాయల ఆస్తులు

Ganja_Neetubai
Ganja Neetubai (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

GANJA QUEEN NEETU BAI FROM DHOOLPET: రోజూ కనీసం 2 నుంచి 4 లక్షల రూపాయల విక్రయాలు. కోట్ల రూపాయల ఆస్తులు. వీటన్నింటికీ మించి పదుల సంఖ్యలో కేసులు. ఇదంతా పేరు మోసిన గ్యాంగ్‌స్టర్‌ గురించి అనుకుంటే పొరబాటే. గంజాయి విక్రయాల్లో ఆరితేరిన ఓ మహిళ స్టోరీ ఇది. ఎక్సైజ్ టీమ్​లు ఇప్పుడు ఈ గంజాయి క్వీన్‌ నీతూబాయి కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. ధూల్‌పేటలో గంజాయి విక్రయాలను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు చేపట్టిన ‘ఆపరేషన్‌ ధూల్‌పేట’లో భాగంగా ఇప్పటివరకు 150 మందిని అరెస్టు చేశారు. అదే విధంగా గంజాయి సిండికేట్‌లో సభ్యురాలైన అంగూరీబాయిని 5 రోజుల క్రితం అరెస్టు చేశారు.

అంతటితో ఆగకుండా మంగళవారం సాయంత్రం అంగూరీబాయి మేనల్లుడు శుభంసింగ్‌ను సైతం అరెస్టుచేశారు. దర్యాప్తులో భాగంగా అతడిని ప్రశ్నించినప్పుడు నానక్‌రామ్‌గూడకు చెందిన నీతూబాయి పేరు బయటకొచ్చింది. నానక్‌రాంగూడ లోథాబస్తీకి చెందిన కాలావతి నీతూబాయి పుట్టి పెరిగింది మొత్తం ధూల్‌పేటలోనే. గతంలో గుడుంబా వ్యాపారం చేసేవారు. అయితే ప్రభుత్వ చర్యలతో అది వదిలేసి క్రమంగా గంజాయివైపు మళ్లారు.

ఫ్యామిలీ మొత్తం ఇదే దందా: నీతూబాయితో పాటు ఆమె భర్త మున్నూసింగ్, ఇద్దరు కుమారులు, బంధువులు అందరిదీ ఇదే దందా. అంగూరీ బాయి నీతూబాయికి బంధువు కావడం గమనార్హం. నీతూబాయి రోజూ సగటున 2 నుంచి 4 లక్షల రూపాయల సరకు అమ్ముతోంది. ఒడిశాలో కిలో గంజాయి 8 వేల రూపాయలకు కొని 5, 10 గ్రాములుగా సెపరేట్ చేసి చిన్నచిన్న పొట్లాల్లో నింపుతారు. 5 గ్రాముల పొట్లాన్ని 500 రూపాయలకి విక్రయిస్తారు. నానక్‌రాంగూడ పక్కనే ఐటీ కారిడార్‌ ఉండటంతో ఇక్కడ పనిచేసే ఉద్యోగులు గంజాయి కొనేందుకు వస్తుంటారని చెబుతున్నారు.

కోట్ల రూపాయల ఆస్తులు: నీతూబాయి కుటుంబం ఎనిమిది సంవత్సరాలలో కోట్ల రూపాయలలో ఆస్తులు కూడగట్టారు. 2023 ఆగస్టులో పోలీసులకు పట్టుబడినప్పుడు ఆరా తీయగా బ్యాంకు ఖాతాల్లో 1.63 కోట్ల రూపాయలతో పాటు స్థిరాస్తులు 2 కోట్ల రూపాయల వరకు ఉన్నట్లు గుర్తించారు. 4 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఎన్‌డీపీఎస్‌ చట్టం (Narcotic Drugs and Psychotropic Substances Act) ప్రకారం జప్తుచేశారు. ఆ కేసులో జైలుకెళ్లినా ఆమె పద్ధతి మార్చుకోలేదు.

టీజీ న్యాబ్‌ (Telangana Anti Narcotics Bureau) ఈ ఏడాది మార్చిలో డెకాయ్‌ ఆపరేషన్‌ చేసి నీతూబాయితో పాటు ఆమె భర్త, మరో 13 మంది వినియోగదారులను అరెస్టు చేసింది. 22.6 కిలోల గంజాయి, 2 ఫోన్లు, 22.10 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. నీతూబాయిపై ఇప్పటివరకు 19 కేసులు నమోదయ్యాయి. 2021లో ఎక్సైజ్ శాఖ అధికారులు ఈమెపై పీడీ యాక్టు ప్రయోగించి సంవత్సరంపాటు జైల్లో ఉంచారు. ఈమె ఇంటి నుంచి డ్రైనేజీకి లింకు ఉండటంతో, ఎవరైనా సోదాలకు వచ్చినప్పుడు గంజాయిని అందులో విసిరేస్తున్నారు. ఇంటి పరిసరాల్లో ఎవరెవరు వస్తున్నారో గమనించించేందుకు సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేసుకున్నారు.

నీతూబాయికి రూ.4 కోట్ల ఆస్తులు - నానక్​రూమ్​గూడ గంజాయి కేసులో విస్తుపోయే విషయాలు

ధూల్‌పేట్​లో గంజాయి 'పుష్ప' - ఎట్టకేలకు అంగూరి భాయి అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.