ETV Bharat / state

కళ్లముందే సముద్రపు కోత - కోనపాపపేటకు గుండె కోత - KONAPAPAPETA MERGING IN SEA

ఇళ్లపైకి వచ్చేస్తున్న సముద్రుడు - భయం గుప్పెట్లో కోనపాపపేట గ్రామం

Konapapapeta Merging in Sea
Konapapapeta Merging in Sea (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

Konapapapeta Merging in Sea : అల్పపీడనాలు, తుపాన్లు అంటే అక్కడి ప్రజలు వణికిపోతారు. ఇక సముద్రం నుంచి ఎగసిపడి తాకే రాకాసి అలలంటే వారు భయాందోళనలకు గురవుతారు. ఆ అలల తాకిడికి వారి ఇళ్లు సముద్రగర్భంలో కలిసిపోవడం వారిని ఆవేదనకు గురిచేస్తోంది. దీంతో వందల కుటుంబాలు నానా అవస్థలు పడుతున్నాయి. గత రెండు నెలల వ్యవధిలో వచ్చిన మూడు తుపాన్ల కారణంగా కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం కోనపాపపేట గ్రామ భూభాగం తీవ్ర కోతకు గురైంది.

రెండు సంవత్సరాల కాలంలో సుమారు 50 మీటర్ల మేర ఇక్కడి భూభాగం సముద్రంలో కలిసిపోయింది. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. సిమెంట్‌ రోడ్లు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం అల్పపీడనం ప్రభావంతో మంగళవారం రాత్రి ఎగసిపడిన కెరటాలకు ఆరు గృహాలు నేలకూలినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4000లకుపైగా జనాభా నివసించే ఈ గ్రామంలో ప్రధాన రహదారి నుంచి సముద్ర తీరం వరకు సుమారు 200 మీటర్ల పరిధిలో ఆరు వరుసల్లో మత్స్యకారుల నివాసాలు ఉండేవి. వాటిలో సుమారు 600 మంది నివసించేవారు. సముద్ర కోత కారణంగా నాలుగు వరుసల్లోని దాదాపు 100 ఇళ్లు కనుమరుగయ్యాయి. దీంతో సుమారు 400 మంది నిరాశ్రయులయ్యారు.

ప్రస్తుతం రెండు వరుసల్లో యాభై ఇండ్లు మాత్రమే మిగిలాయి. వీటిలో 70 కుటుంబాలకు చెందిన సుమారు 250 మంది నివాసం ఉంటున్నారు. వీరి ఇళ్లు కూడా ప్రమాదపు అంచున ఉండటంతో మత్స్యకారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇండ్లు కోల్పోయిన వారు గ్రామంలో మరోచోట స్థలాలు కొనుగోలు చేసుకుంటూ ఆర్థికంగా చితికిపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఉప్పాడకు రక్షణ గోడ నిర్మించినట్లుగానే కోనపాపపేటకు కూడా కట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

రక్షణ గోడ నిర్మించాలి : గత వైఎస్సార్సపీ సర్కార్ సముద్ర కోత నుంచి గ్రామానికి రక్షణ కల్పించలేదని మత్స్యకార నాయకుడు కొర్ని రమణ తెలిపారు. పదుల సంఖ్యలో చెట్లు, గృహాలు, విద్యుత్‌ స్తంభాలు పడిపోయినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం వాకలపూడి నుంచి అమీనాబాద్ వరకు రక్షణ గోడ నిర్మిస్తామని చెప్పారని కోనపాపపేట గ్రామానికి కూడా రక్షణగోడ నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కొర్ని రమణ కోరారు.

ఐదు ఇళ్లు పోయాయి : కొంతకాలంగా మా కుటుంబానికి చెందిన ఐదు ఇళ్లు సముద్రంలో కలిసిపోయాయని ఉమ్మిడి రాంబాబు తెలిపారు . ఇటీవల మరో ఇల్లు కొనుక్కున్నామని చెప్పారు. రెండు రోజులగా ఎగసిపడుతున్న కెరటాలకు అదికూడా పోయిందని వాపోయారు. ప్రస్తుతం పరాయి పంచన బతుకుతున్నట్లు ఉమ్మిడి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

కోతకు గురైన గోదావరి ఏటిగట్లు- స్థానికులను వెంటాడుతున్న వరద భయం - No Quality on Godavari Yetigatlu

ఎగిసిపడుతున్న రాకాసి అలలు - కోత బారిన తీరప్రాంత గ్రామాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.