కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన నాగలక్ష్మి అనే విద్యార్థిని పట్టణంలోని గురు రాఘవేంద్ర పాఠశాలలో మూడవ తరగతి చదువుతోంది. పాఠశాలలో ఏదైనా విభిన్నంగా ప్రాజెక్ట్ వర్క్ చేసుకురమ్మని ఉపాధ్యాయులు చెప్పగా...ఈ బాలిక కందిపప్పుతో హిందిలో వర్ణమాల రూపొందించింది. 150 గ్రాముల కంది పప్పుతో నాగలక్ష్మి వాటిని...మూడు గంటల పాటు శ్రమించి వర్ణమాల తయారుచేసింది. ఈ విధంగా రూపొందించడంపై ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందిస్తున్నారు.
ఇదీ చూడండి: స్వాతంత్య్ర వేడుకలకు.. ఇందిరాగాంధీ మైదానం ముస్తాబు