ETV Bharat / state

'లాక్​డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు'

లాక్​డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర అదనపు డీజీ శ్రీధర్ రావు హెచ్చరించారు. కరోనా రెడ్​జోన్​గా ప్రకటించిన కడప జిల్లా వేంపల్లిలో పర్యటించిన ఆయన లాక్​డౌన్ అమలు తీరును పరిశీలించారు.

లాక్​డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

author img

By

Published : Apr 5, 2020, 6:48 PM IST

కడప జిల్లా వేంపల్లెలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం రెడ్ జోన్​గా ప్రకటించింది. అక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆ ప్రాంతంలో పర్యటించిన రాష్ట్ర అదనపు డీజీ శ్రీధర్ రావు.. జిల్లా ఎస్పీ అన్భురాజన్​తో కలిసి లాక్​డౌన్ అమలు తీరుపై సమీక్షించారు. ఈనెల 14 వరకు లాక్​డౌన్ అమలులో ఉంటుందని ప్రజలెవరూ బయటకు రాకూడదని డీజీ స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులతో సమానంగా కరోనా మహమ్మారిపై జర్నలిస్టులు పోరాడుతున్నారని ఆయన కొనియాడారు.

ఇదీచదవండి

'కరోనాను జయించేందుకు రాబోయే రెండు వారాలు కీలకం'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.