ETV Bharat / state

'అంతర్వేది ఘటనను మతపరంగా చూడొద్దు'

author img

By

Published : Sep 21, 2020, 7:18 PM IST

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శలు సంధించారు. అంతర్వేదిలో జరిగిన ఘటనను మతపరంగా తీర్చిదిద్దడం సరైంది కాదన్నారు. సీబీఐ విచారణ జరుగుతోందని ఎవరు దోషులు అనేది తేలుతుందని పేర్కొన్నారు. డిక్లరేషన్​పై సీఎం సంతకం పెట్టకపోవడానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు.

State Congress Party Working President comments on jagan
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్లే సమయంలో డిక్లరేషన్​పై సంతకం పెట్టకపోవడానికి ఇబ్బంది ఏంటని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ప్రశ్నించారు. సంతకం పెడితే హిందూ అని అందరూ గుర్తిస్తారు.. లేదంటే ఆయన క్రిస్టియన్ అనే విషయం అందరికీ తెలిసిపోతుందని కడపలో పేర్కొన్నారు. వ్యవసాయ బిల్లు తేనెపూసిన కత్తులని... రెండుసభల్లోనూ రెండు బిల్లులను రైతులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టారని విమర్శించారు. ఈ బిల్లు ద్వారా భవిష్యత్తులో రైతులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు.

భాజపా చేతిలో వైకాపా, తెదేపా రెండు పార్టీలు కీలుబొమ్మలు అయ్యాయని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి 16నెలల పాలనలో రైతులకు తీవ్ర ఇబ్బందులు పెట్టాడని ఆరోపించారు. కేసులతో తలమునకలవుతున్న జగన్, విజయసాయిరెడ్డిలకు కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు లేదని ధ్వజమెత్తారు. ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందంటే ఆనాటి కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్టులు వల్లేనని అన్నారు. అంతర్వేదిలో జరిగిన ఘటనను మతపరంగా తీర్చిదిద్దడం సరైంది కాదన్నారు. సీబీఐ విచారణ జరుగుతోందని ఎవరు దోషులు అనేది తేలుతుంది అని పేర్కొన్నారు. మంత్రి సొంత జిల్లాలో గండికోట ముంపు వాసులకు పరిహారం ఇవ్వకుండా వారిని కట్టుబట్టలతో తరిమేయడం దారుణమని ఖండించారు.

ఇదీ చూడండి. ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తున్నాం: ఆళ్ల నాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.