కడప జిల్లా రైల్వే కోడూరు మండలం కుక్కలదొడ్డి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతికి చెందిన వ్యక్తులు రైల్వేకోడూరులో శుభకార్యానికి వెళ్లి వస్తుండగా.. కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తిరుచానూరుకు చెందిన భార్యాభర్తలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని తిరుపతి ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం రాజంపేటకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: