ETV Bharat / state

కడప ఆర్అండ్​బీ అతిథిగృహం వద్ద ఆక్రమణల తొలగింపు...భద్రత కట్టుదిట్టం

కడప ఆర్అండ్​బీ అతిథిగృహం పరిసర ప్రాంతాల్లో ఆక్రమణలను అధికారులు తొలగించారు. ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణానికి సీఎం జగన్​, గవర్నర్​ రానున్న నేపథ్యంలో అధికారులు ఆక్రమణలను తొలగించి... భద్రతను కట్టుదిట్టం చేశారు.

author img

By

Published : Apr 12, 2022, 11:11 AM IST

Occupancy clearance
ఆక్రమణల తొలగింపు

వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలో ఈనెల 15న జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్మోహన్ రెడ్డి రానున్నారు. ఈ నేపథ్యంలో కడప ఆర్అండ్​బీ అతిథిగృహం పరిసర ప్రాంతాల్లో దుకాణదారుల అక్రమ నిర్మాణాలను నగరపాలక అధికారులు తొలగించారు. కళ్యాణోత్సవం అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రి ఆ రోజు రాత్రికి కడపలోనే బస చేయనున్నారు. ఈ క్రమంలో పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం ఏర్పాటు చేశారు. దాదాపుగా నాలుగు వేల మంది పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.

Brahmotsavalu: వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. సోమవారం రాత్రి స్వామివారు హంసవాహనంపై ఊరేగారు. ఆలయం చుట్టూ తిరిగిన హంస వాహనసేవ ...ఒంటిమిట్ట పురవీధుల గుండా సాగింది. హంస వాహనం లో ఊరేగుతున్న శ్రీరాముని తిలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వాహన సేవ ముందు భక్తులు కోలాటాలతో అలరించారు.

ఒంటిమిట్ట కోదండరాముడి కోవెలలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం జగదభిరాముడు వేణుగాన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఏకశిలానగరి వీధుల్లో పురుషోత్తముడి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. 15వ తేదీ రాత్రి సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు తితిదే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ముత్యాల తలంబ్రాలు పంపిణీ చేయడానికి 2 లక్షల పొట్లాలు సిద్ధం చేస్తున్నట్లు డిప్యూటీ ఈవో తెలిపారు.

కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల 15న జిల్లాలో పలుచోట్ల నుంచి ఒంటిమిట్టకు 135 బస్సులు నడపనున్నారు. ఒంటిమిట్ట నుంచి కల్యాణ వేదిక వరకు 4 ఉచిత బస్సు సర్వీసులు ఉంటాయి. కడప నుంచి ఒంటిమిట్టకు అత్యధికంగా 35 బస్సులు ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి: Vontimitta: 15న ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణోత్సవం... ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.