అక్టోబర్ 7 మారణహోమానికి ఏడాది- గాజా, లెబనాన్‌పై ఇజ్రాయెల్ నిప్పుల వర్షం - israel intense attacks on lebanon - ISRAEL INTENSE ATTACKS ON LEBANON
Israel Intense Attacks On Lebanon: హమాస్‌తో మధ్య యుద్ధం మెుదలై సోమవారం నాటికి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడులను మరింత తీవ్రతరం చేసింది. హమాస్, హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా గాజా, లెబనాన్‌లో మరోసారి భీకర వైమానిక దాడులు చేసింది. ప్రతీకారంగా ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరాలపై హెజ్‌బొల్లా రాకెట్లు దూసుకెళ్లాయి. హెజ్‌బొల్లా ప్రయోగించిన దాదాపు 130కిపైగా రాకెట్లు తమ భూభాగంలోకి వచ్చాయని, వాటిని తాము అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. (Associated Press)
Published : Oct 7, 2024, 9:58 AM IST