ETV Bharat / offbeat

దేవభూమి ఉత్తరాఖండ్‌ చూసి తరించాల్సిందే! - తక్కువ ధరలోనే IRCTC సూపర్​ ప్యాకేజీ! - IRCTC Uttarakhand Tour - IRCTC UTTARAKHAND TOUR

దేవభూమిగా పేరుగాంచిన ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను కవర్​ చేసేలా IRCTC టూరిజం శాఖ సూపర్​ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్​ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Uttarakhand IRCTC Tour
Hyderabad To Uttarakhand IRCTC Tour (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 7, 2024, 10:41 AM IST

Hyderabad To Uttarakhand IRCTC Tour : భక్తులందరికీ ఆధ్యాత్మిక కేంద్రాలు, పుణ్యక్షేత్రాలను సందర్శించాలని ఉంటుంది. ఇలాంటి వారి కోసం IRCTC టూరిజం ఎప్పటికప్పుడూ రకరకాల ప్యాకేజీలను అందుబాటులో తీసుకువస్తోంది. తాజాగా దేవభూమిగా పేరుగాంచిన ఉత్తరాఖండ్‌లోని ఆధ్యాత్మిక క్షేత్రాలు, బెస్ట్​ టూరిస్ట్​ ప్లేస్​లను కవర్​ చేస్తే అద్దిరిపోయే టూర్​ ప్యాకేజీని ప్రకటించింది. ఇంతకీ ఈ టూర్​ ఎన్ని రోజులు? ఏ ప్రదేశాలు చూడొచ్చు? ధర ఎంత? ప్రయాణం ఎప్పుడు అనే వివరాలను ఈ స్టోరీలో చూద్దాం.

ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్ "దేవ్​ భూమి ఉత్తరాఖండ్​ యాత్ర​(​Dev Bhoomi Uttarakhand Yatra)" పేరుతో ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్​ మొత్తం 10 రాత్రులు, 11 పగళ్లు ఉంటుంది. హైదరాబాద్ (సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​)​ నుంచి ట్రైన్​ జర్నీ ద్వారా ఈ ప్యాకేజీ ఆపరేట్​ చేస్తున్నారు. భారత్ గౌరవ్ మానస్ ఖండ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా దేవ్ భూమి ఉత్తరాఖండ్ యాత్ర ఉంటుంది.

ప్రయాణం ఇలా..

డే1..

మొదటి రోజు సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జర్నీ స్టార్ట్​ అవుతుంది.

డే2..

రెండవ రోజు మొత్తం ప్రయాణం ఉంటుంది.

డే3..

మూడవ రోజు మార్నింగ్​ కత్గోడం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ రైలు దిగి భీమ్‌తాల్‌కు వెళ్తారు. హోటల్లో స్టే చేస్తారు. ఈవెనింగ్​ భీమ్‌తాల్ సరస్సును చూస్తారు. నైట్ అదే​ హోటల్లో బస ఉంటుంది.

డే4..

మార్నింగ్​ హోటల్లో బ్రేక్​ఫాస్ట్​ చేసిన తర్వాత నైనిటాల్ చూడడానికి వెళ్తారు. అక్కడ నైనాదేవి ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక్కడ మీరు బోటింగ్, షాపింగ్​ చేసుకోవచ్చు. అక్కడ నుంచి భీమ్‌తాల్‌కు తిరిగి వెళ్తారు. ఆ హోటల్లోనే స్టే చేస్తారు.

డే5..

మార్నింగ్​ బ్రేక్​ఫాస్ట్​ చేసి హోటల్​ నుంచి బయలు దేరతారు. అక్కడ నుంచి అల్మోరాకు వెళ్తారు. అల్మోరాలో హోటల్లో చెక్​ఇన్​ అవుతారు. కాసర్​ దేవి ఆలయాన్ని సందర్శిస్తారు. నైట్​ హోటల్లో స్టే చేస్తారు.

డే6..

మార్నింగ్​ బ్రేక్​ఫాస్ట్​ చేసి.. అనంతరం నందా దేవి ఆలయం, జాగేశ్వర్ ఆలయాన్ని దర్శించుకుంటారు. అలాగే గోలు చిటై ఆలయాన్ని సందర్శిస్తారు. తర్వాత అల్మోరాలోని హోటల్లో బస చేస్తారు.

డే7..

బ్రేక్​ఫాస్ట్​ చేసిన తర్వాత కతర్మల్ సూర్య దేవాలయాన్ని దర్శనం చేసుకుంటారు. అక్కడ నుంచి కౌసనికి చేరుకుని హోటల్లో చెక్-ఇన్ అవుతారు.

డే8..

ఈ రోజున బైజ్‌నాథ్‌కు వెళ్లి బైజ్‌నాథ్ ఆలయాన్ని చూస్తారు. అలాగే బాగేశ్వర్ ఆలయాన్ని సందర్శిస్తారు. నైట్​ కౌసనిలోని హోటల్లో బస చేస్తారు.

డే9..

ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తర్వాత హోటల్ చెక్ అవుట్ చేసి రాణిఖేత్‌కి వెళ్తారు. అక్కడ నుంచి రిటర్న్​ జర్నీ కోసం.. కత్గోడం రైల్వే స్టేషన్‌కు వెళ్తారు.

డే10..

మొత్తం రైలు ప్రయాణం సాగుతుంది

డే11..

హైదరాబాద్​ చేరుకోవడంతో టూర్​ పూర్తవుతుంది.

ధర వివరాలు చూస్తే:

  • డీలక్స్​ క్లాసులో పెద్దలకు రూ. 46,945, పిల్లలకు (5-11 సంవత్సరాలు) రూ.46,945 ఛార్జ్​ చేస్తున్నారు.
  • స్టాండర్ట్ క్లాసులో పెద్దలకు రూ. 37,220, పిల్లలకు (5-11 సంవత్సరాలు) రూ.37,220 ఛార్జ్​ చేస్తున్నారు.
  • ప్రస్తుతం ఈ ప్యాకేజీ నవంబర్​ మూడవ తేదీలో (03.11.2024) అందుబాటులో ఉంది.
  • ఈ టూర్​కి సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్​ కోసం ఈ లింక్​ పై క్లిక్​ చేయండి.

ఇవి కూడా చదవండి :

హైదరాబాద్​ to అండమాన్ - ఐఆర్​సీటీసీ స్పెషల్​ ప్యాకేజీ - ప్రకృతి ఒడిలో హాయిగా సేదతీరొచ్చు!

IRCTC "హ్యాపీ హిమాచల్​ అండ్​ పాపులర్​ పంజాబ్​" - అందుబాటు ధరలోనే 8 రోజుల టూర్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.