రెండో భద్రాద్రిగా పిలుచుకునే కడప జిల్లా రాజంపేటలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో.. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి వేకువజామునే అభిషేకాలు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు తరలిరాగా.. భక్తులతో ఆలయం కిటకిటలాడింది.
స్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు, పూజలు వైభవంగా జరిగాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉత్తర ద్వారం నుంచి వెళ్లి.. భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమం ఆద్యంతం కన్నులపండుగగా సాగింది.
ఇదీ చదవండి: